Breaking News

ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌

Published on Thu, 03/14/2024 - 04:19

న్యూఢిల్లీ: ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా రెండో ఏడాది తుది పోరుకు అర్హత సాధించింది. గ్రూప్‌ దశలో ఆడిన 8 మ్యాచ్‌లలో 6 గెలిచిన ఢిల్లీ 12 పాయింట్లతో టాపర్‌గా ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. ఈ ఓటమితో పట్టికలో చివరి స్థానంతో గుజరాత్‌ ఈ సీజన్‌ను ముగించింది.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ జెయింట్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులే చేసింది. భారతి ఫుల్‌మలి (36 బంతుల్లో 42; 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా...కాథరీన్‌ బ్రైస్‌ (22 బంతుల్లో 28 నాటౌట్‌; 4 ఫోర్లు), ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (21 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఒకదశలో జట్టు స్కోరు 48/5 కాగా... భారతి, బ్రైస్‌ ఆరో వికెట్‌కు 50 బంతుల్లో 68 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఢిల్లీ బౌలర్లలో మిన్ను మణి, మరిజాన్‌ కాప్, శిఖా పాండే తలా 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ 13.1 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు సాధించి గెలిచింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (37 బంతుల్లో 71; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు వేగంలో అర్ధసెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్‌ (28 బంతుల్లో 38 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మరోసారి జోరు ప్రదర్శించింది. షఫాలీ, జెమీమా మూడో వికెట్‌కు 55 బంతుల్లోనే 94 పరుగులు జత చేశారు. విజయానికి 2 పరుగుల దూరంలో షఫాలీ వెనుదిరిగినా... జెమీమా ఫోర్‌ కొట్టడంతో మరో 41 బంతులు మిగిలి ఉండగానే క్యాపిటల్స్‌ జట్టుకు గెలుపు దక్కింది.

ఫైనల్లో ఢిల్లీ ప్రత్యర్థిని నిర్ణయించే ‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌ రేపు జరుగుతుంది. గత ఏడాది చాంపియన్‌ ముంబై ఇండియన్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ‘ఎలిమినేటర్‌’ పోరులో తలపడనున్నాయి. లీగ్‌ దశలో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా... చెరో మ్యాచ్‌లో విజయం సాధించి సమఉజ్జీలుగా నిలిచాయి. ఆదివారం జరిగే ఫైనల్‌తో డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌ ముగుస్తుంది.   

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)