Breaking News

WPL 2025: ముంబై వర్సెస్‌ ఢిల్లీ.. యువ సంచలనం అరంగేట్రం

Published on Sat, 02/15/2025 - 19:18

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌-2025లో భాగంగా రెండో మ్యాచ్‌లో వ‌డోద‌ర‌గా వేదిక‌గా ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్‌, ముంబై ఇండియ‌న్స్ ఉమెన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌తో భారత మహిళల జట్టు అండర్‌-19 కెప్టెన్ నికీ ప్రసాద్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున డబ్ల్యూపీల్ అరంగేట్రం చేసింది. ఇటీవల జరిగిన మహిళల అండర్‌-19 ప్రపంచకప్‌లో  17 ఏళ్ల నికీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఆమె సారథ్యంలోనే భారత్‌ విశ్వవిజేతగా నిలిచింది.

మరోవైపు స్కాట్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ సారా జెన్నిఫర్ బ్రైస్ కూడా ఢిల్లీ తరపున డబ్ల్యూపీఎల్‌లోకి అడుగుపెట్టింది. అదేవిధంగా హర్మాన్‌ ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా తన 150వ మ్యాచ్‌ ఆడనుంది. హర్మాన్‌ ముంబై సారథిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ ప్లేయింగ్ ఎలెవన్: మెగ్ లానింగ్ (కెప్టెన్‌), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సీ, జెమిమా రోడ్రిగ్స్, అన్నాబెల్ సదర్లాండ్, నికి ప్రసాద్, సారా జెన్నిఫర్ బ్రైస్ (వికెట్ కీపర్‌), శిఖా పాండే, అరుంధతి రెడ్డి, మిన్ను మణి, రాధా యాదవ్

ముంబై ఇండియన్స్ ఉమెన్ ప్లేయింగ్ : యాస్తికా భాటియా (వికెట​ కీపర్‌), హేలీ క్రిస్టెన్ మాథ్యూస్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, సజీవన్ సజన, అమంజోత్ కౌర్, జింటిమణి కలితా, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్


 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి