Breaking News

స‌న్‌రైజ‌ర్స్‌ను చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌..

Published on Sun, 03/30/2025 - 19:50

ఐపీఎల్‌-2025లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ వ‌రుస‌గా రెండో ఓట‌మి చ‌విచూసింది. వైజాగ్ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప‌రాజయం పాలైంది. 164 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ల‌క్ష్యాన్ని చేధించింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో ఫాఫ్ డుప్లెసిస్‌(50) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. జాక్ ఫ్రెజ‌ర్ మెక్‌గ‌ర్క్‌(38), అభిషేక్ పోరెల్‌(34) రాణించారు. 

ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో జీష‌న్ అన్సారీ ఒక్కడే మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మిగితా బౌల‌ర్లంద‌రూ దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ మరోసారి తేలిపోయాడు. త‌న స్దాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోతున్నాడు. మూడు ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన ష‌మీ.. వికెట్ ఏమీ తీయ‌కుండా 31 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

ఐదేసిన స్టార్క్‌..
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లోనూ ఎస్ఆర్‌హెచ్ తేలిపోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్‌(32), హెడ్‌(22) పరుగులతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధిం‍చారు.
చ‌ద‌వండి: IPL 2025: వైజాగ్‌లో అనికేత్ వ‌ర్మ విధ్వంసం.. వీడియో వైర‌ల్

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)