Breaking News

IPL 2025: గంగూలీకి బైబై.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక ప్రకటన

Published on Thu, 10/17/2024 - 18:42

ఐపీఎల్‌-2025 సీజన్‌ ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. తమ జట్టు ప్రధాన కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్‌ హేమంగ్‌ బదానీని నియమించినట్లు తెలిపింది. అదే విధంగా.. డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ బాధ్యతలను మరో భారత మాజీ క్రికెటర్‌ వేణుగోపాల్‌ రావుకు అప్పగించినట్లు పేర్కొంది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది.

కాగా.. గతంలో వీరిద్దరు ఐపీఎల్‌లో ఆడారు. వేణుగోపాల్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌(పాతపేరు)కు ఆడగా.. 2010లో ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో బదానీ సభ్యుడు. వీరిద్దరూ కలిసి టీమిండియాకూ ఆడారు.   అంతేకాదు.. వేణుగోపాల్‌ రావు తెలుగు, బదానీ తమిళ కామెంట్రీ కూడా చేశారు.

ఇక ఢిల్లీ ఫ్రాంఛైజీ కోచింగ్‌ స్టాఫ్‌లో పనిచేసిన అనుభవం కూడా వీరికి ఉంది. ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో దుబాయ్‌ క్యాపిటల్స్‌ జట్టుకు వీరు సేవలు అందించారు. మరోవైపు..  బదానీ ఇటీవలే.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ చాంపియన్స్‌ సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌ బ్యాటింగ్‌ కోచ్‌గానూ నియమితుడు కావడం గమనార్హం.

పాంటింగ్‌, గంగూలీకి బైబై
హెడ్‌కోచ్‌గా బదానీ, డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా వేణుగోపాల రావు నియాకం పట్ల ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని కిరణ్‌ కుమార్‌ గాంధీ హర్షం వ్యక్తం చేశాడు. వీరిద్దరికి తమ క్యాపిటల్స్‌ కుటుంబంలో స్వాగతం పలుకుతున్నామని.. వీరి రాకతో జట్టు విజయపథంలో నడుస్తుందని ఆశిస్తున్నామన్నాడు. 

కాగా ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌తో సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్న ఢిల్లీ.. ఇటీవలే అతడిని హెడ్‌కోచ్‌ పదవి నుంచి తప్పించింది. పాంటింగ్‌ స్థానాన్ని తాజాగా బదానీతో భర్తీ చేసింది.  ఇక డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా సౌరవ్‌ గంగూలీ స్థానంలో వేణుగోపాలరావును తీసుకువచ్చింది.

చదవండి: IND Vs NZ 1st Test: అసలేం చేశావు నువ్వు?: రోహిత్‌ శర్మ ఆగ్రహం

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు