వారియర్స్‌ X చాలెంజర్స్‌

Published on Mon, 02/24/2025 - 04:15

బెంగళూరు: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 టోర్నమెంట్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గత మ్యాచ్‌లో ఘనవిజయంతో సీజన్‌లో బోణీ కొట్టిన యూపీ వారియర్స్‌ జట్టుతో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) సోమవారం చిన్నస్వామి స్టేడియంలో తలపడుతుంది. సొంత అభిమానుల మద్దతు మధ్య జరుగనున్న పోరులో సత్తా చాటాలని స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్‌సీబీ భావిస్తుంటే... గెలుపు జోరును కొనసాగించాలని యూపీ వారియర్స్‌ చూస్తోంది. 

తాజా సీజన్‌లో ఆర్‌సీబీ మూడు మ్యాచ్‌లాడి 2 విజయాలు, 1 పరాజయంతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు యూపీ వారియర్స్‌ మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, 2 పరాజయాలతో నాలుగో స్థానంలో ఉంది. స్మృతి, డానీ వ్యాట్, ఎలీస్‌ పెర్రీ, రాఘవి బిస్త్, రిచా, కనిక, జార్జియాతో కూడిన ఆర్‌సీబీ జట్టు బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా స్మృతి సూపర్‌ ఫామ్‌ ఆ జట్టుకు కలిసి రానుంది. 

స్మృతి ఆడిన గత 10 మ్యాచ్‌ల్లో (అంతర్జాతీయ, డబ్ల్యూపీఎల్‌ కలిపి) 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలు చేయడమే అందుకు నిదర్శనం. బౌలింగ్‌లో రేణుక, కిమ్‌ గార్త్, ఏక్తా బిష్త్‌ జోషిత కీలకం కానున్నారు. మరోవైపు దీప్తి శర్మ సారథ్యంలోని యూపీ వారియర్స్‌ జట్టులో నిలకడ లోపించింది. కెప్టెన్‌ దీప్తి శర్మతో పాటు కిరణ్‌ నవగిరె, వృందా దినేశ్, తాలియా మెక్‌గ్రాత్, శ్వేత సెహ్రావత్, గ్రేస్‌ హ్యారిస్, ఉమ ఛెత్రి కలిసి కట్టుగా రాణించాల్సిన అవసరం ఉంది.

గత మ్యాచ్‌లో భీకర హిట్టింగ్‌తో విజృంభించిన షినెల్‌ హెన్రీపై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లో యువ మీడియం పేసర్‌ క్రాంతి గౌడ్‌తో పాటు స్పిన్నర్‌ గ్రేస్‌ హ్యారిస్‌ చక్కటి ప్రదర్శన చేస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో ఉన్న బెంగళూరుపై పైచేయి సాధించాలంటే యూపీ వారియర్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకోవాల్సిన అవసరముంది.  

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)