Breaking News

టైటిల్‌ వేట మొదలైంది...

Published on Thu, 05/30/2024 - 03:59

పారిస్‌: కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గాలనే లక్ష్యంతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) తొలి రౌండ్‌ను దాటాడు. ప్రపంచ 142వ ర్యాంకర్‌ హెర్బర్ట్‌ (ఫ్రాన్స్‌)తో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో జొకోవిచ్‌ 2 గంటల 31 నిమిషాల్లో 6–4, 7–6 (7/3), 6–4తో గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. ప్రత్యర్థి సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ నెట్‌ వద్ద 19 పాయింట్లు గెలిచాడు. 

మరోవైపు మూడో సీడ్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), ఆరో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా), తొమ్మిదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో అల్‌కరాజ్, సిట్సిపాస్‌లకు తమ ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురుకాగా... రుబ్లెవ్‌ వరుస సెట్‌లలో విజయాన్ని అందుకున్నాడు. అల్‌కరాజ్‌ 3 గంటల 9 నిమిషాల్లో 6–3, 6–4, 2–6, 6–2తో జెస్పర్‌ డి జాంగ్‌ (నెదర్లాండ్స్‌)పై, సిట్సిపాస్‌ 2 గంటల 43 నిమిషాల్లో 6–3, 6–2, 6–7 (2/7), 6–4తో అల్టమెయిర్‌ (జర్మనీ)పై, రుబ్లెవ్‌ 2 గంటల 1 నిమిషంలో 6–3, 6–4, 6–3తో పెడ్రో మార్టినెజ్‌ (స్పెయిన్‌)పై గెలుపొందారు. 

జాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్‌కరాజ్‌ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి స ర్వి స్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్‌ చేశాడు. 35 విన్నర్స్‌ కొట్టిన ఈ స్పెయిన్‌ స్టార్‌ ఏకంగా 47 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం.  మహిళల సింగిల్స్‌లో 2020 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా), ఎనిమిదో సీడ్‌ ఆన్స్‌ జబర్‌ (ట్యునీ షియా) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. 

రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో సోఫియా 6–3, 6–3తో 21వ సీడ్‌ కరోలినా గార్సియా (ఫ్రాన్స్‌)పై, ఎనిమిదో సీడ్‌ ఆన్స్‌ జబర్‌ (ట్యునీషియా) 6–3, 1–6, 6–3తో కామిలా ఒసోరియో (కొలంబియా)పై గెలుపొందారు. భారీ వర్షాల కారణంగా బుధవారం ఏకంగా 23 సింగిల్స్‌ మ్యాచ్‌లను వాయిదా వేశారు. 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)