ప్రిక్వార్టర్స్‌లో భారత జట్ల ఓటమి

Published on Thu, 02/22/2024 - 04:17

బుసాన్‌: పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌లు ఖరారు కావడానికి అవసరమైన విజయాన్ని భారత మహిళల, పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) జట్లు సాధించలేకపోయాయి. పటిష్ట జట్లతో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో భారత జట్లు ఓడిపోయి ప్రపంచ టీటీ టీమ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి నిష్క్రమించాయి.

బుధవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు 1–3తో చైనీస్‌ తైపీ జట్టు చేతిలో... భారత పురుషుల జట్టు 0–3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయాయి. అంతకుముందు జరిగిన నాకౌట్‌ దశ రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 3–0తో ఇటలీపై... భారత పురుషుల జట్టు 3–2తో కజకిస్తాన్‌పై విజయం సాధించాయి.

ఈ మెగా ఈవెంట్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన 8 జట్లు పారిస్‌ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాయి. మార్చి 5న విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌–16లో చోటు సంపాదిస్తే భారత జట్లకు పారిస్‌ ఒలింపిక్‌ బెర్త్‌లు లభిస్తాయి. ప్రస్తుతం భారత మహిళల జట్టు 17వ ర్యాంక్‌లో, భారత పురుషుల జట్టు 15వ ర్యాంక్‌లో ఉన్నాయి.  

చైనీస్‌ తైపీతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్‌ మనిక బత్రా 11–8, 8–11, 4–11, 11–9, 11–9తో ప్రపంచ 10వ ర్యాంకర్‌ చెన్‌ జు యుపై సంచలన విజయం సాధించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది.

రెండో మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 6–11, 9–11, 5–11తో చెంగ్‌ ఐ చింగ్‌ చేతిలో... మూడో మ్యాచ్‌లో ఐహిక ముఖర్జీ 10–12, 13–15, 11–9, 2–11తో లి యు జున్‌ చేతిలో... నాలుగో మ్యాచ్‌లో మనిక బత్రా 10–12, 11–5, 9–11, 5–11తో చెంగ్‌ ఐ చింగ్‌ చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖరారైంది. 

కొరియాతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో హర్మీత్‌ దేశాయ్‌ 10–12, 11–13, 7–11తో జాంగ్‌ వూజిన్‌ చేతిలో... రెండో మ్యాచ్‌లో ఆచంట శరత్‌ కమల్‌ 9–11, 5–11, 11–8, 4–11తో లిమ్‌ జాంగ్‌హూన్‌ చేతిలో... మూడో మ్యాచ్‌లో సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ 5–11, 8–11, 2–11తో లీ సాంగ్‌ హు చేతిలో ఓటమి పాలయ్యారు. 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)