Breaking News

వెస్టిండీస్ స్టార్ క్రికెట‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. రిటైర్మెంట్ వెన‌క్కి

Published on Sun, 07/28/2024 - 12:25

వెస్టిండీస్ క్రికెట్‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. విండీస్ మ‌హిళ క్రికెట్ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ డియాండ్రా డాటిన్ త‌న రిటైర్మెంట్‌ను వెన‌క్కి తీసుకుంది. వెస్టిండీస్ క్రికెట్ అధికారులతో చర్చలు జ‌రిపిన అనంత‌రం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు డాటిన్ తెలిపింది.  కాగా 2022లో జట్టులో అంతర్గత విభేదాలు వల్ల డాటిన్ అంతర్జాతీయ విడ్కోలు పలికింది.

అయితే ఈ ఏడాది ఆక్టోబ‌ర్‌లో బంగ్లాదేశ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్  దృష్ట్యా.. డాటిన్ తన రిటైర్మెంట్‌పై యూటర్న్ తీసుకుంది. "అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ గర్వంగానే భావిస్తాను. క్రికెట్ వెస్టిండీస్ ప్రెసిడెంట్ డాక్టర్. కిషోర్ షాలోతో చర్చలు అనంతరం నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. తిరిగి విండీస్ జెర్సీని ధరించేందుకు సిద్దమయ్యాను. మళ్లీ జట్టులో తిరిగి చేరేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను.

వెస్టిండీస్ మహిళల జట్టుకు అన్ని ఫార్మాట్లలో నా వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తాను. నా నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని డాటిన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక 2008లో డాటిన్‌  విండీస్‌ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్‌లో 146 వన్డేలు, 126 టీ20ల్లో విండీస్‌కు ప్రాతినిధ్యం వహించింది. అదే విధంగా తొలి టీ20 ప్రపంచకప్‌ గెలిచిన విండీస్‌ జట్టులో డాటిన్‌ భాగంగా ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)