Breaking News

ముంబై గెలిచింది, రోహిత్‌ హాఫ్‌సెంచరీ చేశాడు.. సరే, ఇతని మాట ఏమిటి..?

Published on Wed, 04/12/2023 - 15:43

ఐపీఎల్‌-2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చివరి బంతికి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో గత రెండు మ్యాచ్‌ల్లాగే ఈ మ్యాచ్‌ కూడా నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగి ప్రేక్షకులకు కావాల్సి అసలు సిసలు టీ20 మజా అందించింది. 

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌ ఆఖరి 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి తన జట్టుకు సంచలన విజయాన్నందించగా.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో స్టోయినిస్‌, పూరన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ల సాయంతో  లక్నో చివరి బంతికి విజేతగా నిలిచింది. నిన్న డీసీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌, తిలక్‌ వర్మ మెరుపుల సాయంతో ముంబై కూడా  చివరాఖరి బంతికే విజయం సాధించింది. 

కాగా, గత రెండు మ్యాచ్‌ల్లో చివరి ఓవర్‌ వేసిన బౌలర్లు మంచికో చెడుకో ఏదో ఓ కారణంగా వార్తల్లో నిలిచారు. రింకూ సింగ్‌ ఊచకోత ధాటికి బలైన యశ్‌ దయాల్‌, ఆఖరి బంతికి మన్కడింగ్‌ చేసే ప్రయత్నం చేసి విఫలమైన హర్షల్‌ పటేల్‌ వేర్వేరు కారణాల చేత ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ రెండు సందర్భాల్లో బౌలర్లు శక్తివంచన లేకుండా కృషి చేసినప్పటకీ, బ్యాటర్ల ఆధిపత్యం కారణంగా వారు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. 

అయితే ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ అద్భుతంగా బౌల్‌ చేసిన, ప్రత్యర్ధిని దాదాపు ఓడించినంత పని చేసిన డీసీ పేసర్‌ అన్రిచ్‌ నోర్జేకు మాత్రం దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. ఈ సీజన్‌లో ముంబై తొలి గెలుపు, సుదీర్ఘకాలం తర్వాత హిట్‌ మ్యాన్‌ హాఫ్‌ సెంచరీ, తిలక్‌ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌ల కారణంగా నోర్జే ప్రదర్శన మరుగున పడింది. 

చివరి ఓవర్‌లో ముంబై గెలుపుకు కేవలం 5 పరుగులు మాత్రమే అవసరం కాగా.. నోర్జే అత్యంత పిసినారిగా మారి, మ్యాచ్‌ను ఆఖరి బంతివరకు తీసుకొచ్చాడు. తొలి బంతికి సింగిల్‌ ఇచ్చిన నోర్జే.. ఆతర్వాత 2, 3 బంతులు డాట్‌బాల్స్‌ వేసి 4,5 బంతులకు రెండు సింగిల్స్‌ మాత్రమే ఇచ్చి ముంబై శిబిరానికి ముచ్చెమటలు పట్టించాడు. అయితే ఆఖరి బంతికి టిమ్‌ డేవిడ్‌ 2 పరుగులు తీయడంతో, బతుకు జీవుడా అని ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)