ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ పేసర్‌కు బీసీసీఐ మందలింపు

Published on Thu, 04/25/2024 - 16:44

ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ పేసర్‌ రసీఖ్‌ సలాం దర్‌ను బీసీసీఐ మందలించింది. ఐపీఎల్‌-2024లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అతి చేసినందుకు వార్నింగ్‌ ఇచ్చింది. ఇంకోసారి ఇలాంటివి పునరావృతం చేయకూడదని హెచ్చరించింది.

కాగా ఢిల్లీ వేదికగా టైటాన్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రసీఖ్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసిన ఈ రైటార్మ్‌ పేసర్‌ 44 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. సాయి సుదర్శన్‌(39 బంతుల్లో 65), షారుఖ్‌ ఖాన్‌(8), రవిశ్రీనివాసన్‌ సాయి కిషోర్‌(13)లను అవుట్‌ చేశాడు. 

ముఖ్యంగా లక్ష్య ఛేదనలో ప్రమాదకారిగా మారుతున్న సాయి సుదర్శన్‌ను పెవిలియన్‌కు పంపడం ద్వారా రసీఖ్‌ మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పాడు. అలా ఢిల్లీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు 24 ఏళ్ల ఈ కశ్మీరీ ఎక్స్‌ప్రెస్‌.

అయితే, వికెట్‌ తీసిన ప్రతిసారీ రసీఖ్‌ కాస్త వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. దీంతో బీసీసీఐ అతడిని మందలించింది. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈమేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.

కాగా అరుణ్‌ జైట్లీ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ గుజరాత్‌పై 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.

అయితే, లక్ష్య ఛేదనలో గుజరాత్‌ టైటాన్స్‌ ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఎనిమిది వికెట్లు నష్టపోయి 220 పరుగుల వద్ద నిలిచి ఓటమి పాలైంది.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)