Breaking News

రావల్పిండి టెస్టు.. పాక్‌కు ధీటుగా బదులిస్తున్న బంగ్లాదేశ్‌

Published on Fri, 08/23/2024 - 19:36

రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ గట్టి పోటీ ఇస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. 26 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాను ఆదిలోనే పేసర్‌ ఖుర్రం షాజాద్ దెబ్బకొట్టాడు. 

ఓపెనర్ జకీర్ హోస్సేన్‌, కెప్టెన్ శాంటోను ఔట్ చేసి బంగ్లాను బ్యాక్ ఫుట్‌లో ఉంచే ప్రయత్నం చేశాడు. కానీ షాద్మాన్ ఇస్లాం(93), మోమినుల్ హక్(50) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి పాక్ బౌలర్లకు ధీటుగా బదులిచ్చారు. 

షాద్మాన్, మోమినుల్ ఔటైన తర్వాత వారి బాధ్యతను లిట్టన్ దాస్‌, ముష్పికర్ రహీమ్ తీసుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా మూడో రోజు ఆటను ముగించారు. మొదటి ఇన్నింగ్స్‌లో పాక్ కంటే బంగ్లా ఇంకా 132 పరుగులు వెనకబడి ఉంది.

ప్రస్తుతం క్రీజులో లిట్టన్ దాస్‌(52),  ముష్పికర్ రహీమ్‌(55) పరుగులతో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఖుర్రం షాజాద్ రెండు వికెట్లు పడగొట్టగా.. నసీం​ షా, అయూబ్, మ‌హ్మ‌ద్ అలీ త‌లా వికెట్ సాధించారు. కాగా పాక్ త‌మ తొలి ఇన్నింగ్స్‌ను 448/6 వద్ద డిక్లేర్‌ చేసింది.
 

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)