Breaking News

దుబాయ్‌ క్యాపిటల్స్‌లోకి వార్నర్‌, వుడ్‌.. అఫ్రిది, షాదాబ్‌ ఖాన్‌ మరో జట్టుతో..!

Published on Mon, 08/21/2023 - 17:34

యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషన్‌ లీగ్‌ టీ20 సీజన్‌-2 (2024) కోసం ఆయా ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. లీగ్‌లో పాల్గొనే ఆరు జట్లు తమ పాత ఆటగాళ్లను కొందరిని రిటైన్‌ చేసుకోవడంతో పాటు కొత్తగా 50 మంది ఆటగాళ్లతో డీల్‌ కుదుర్చుకున్నాయి. అబుదాబీ నైట్‌రైడర్స్‌ 8, డెజర్ట్‌ వైపర్స్‌ 6, దుబాయ్‌ క్యాపిటల్స్‌ 11, గల్ఫ్‌ జెయింట్స్‌ 5, ఎంఐ ఎమిరేట్స్‌ 8, షార్జా వారియర్స్‌ 12 మంది ఆటగాళ్లను తమ పంచన చేర్చుకున్నాయి.

కొత్తగా లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చే వాళ్లలో డేవిడ్‌ వార్నర్‌ (దుబాయ్‌ క్యాపిటల్స్‌), మార్క్‌ వుడ్‌, షాదాబ్‌ ఖాన్‌ (డెజర్ట్‌ వైపర్స్‌), షాహీన్‌ అఫ్రిది (డెజర్ట్‌ వైపర్స్‌), ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (గల్ఫ్‌ జెయింట్స్‌), అంబటి రాయుడు (ఎంఐ ఎమిరేట్స్‌), కోరె ఆండర్సన్‌ (ఎంఐ ఎమిరేట్స్‌), మార్టిన్‌ గప్తిల్‌ (షార్జా వారియర్స్‌) లాంటి స్టార్‌ ప్లేయర్లు ఉన్నారు. ఆటగాళ్ల ఎంపిక సంబంధించిన మొత్తం తంతును ఆయా ఫ్రాంచైజీలు ఇవాళ (ఆగస్ట్‌ 21) పూర్తి చేశాయి.  ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 సీజన్‌-2 వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది.

DP వరల్డ్ ILT20 సీజన్ 2 కోసం ఆయా ఫ్రాంచైజీ ఆటగాళ్ల పూర్తి జాబితా..

అబుదాబి నైట్ రైడర్స్
కొత్త ఆటగాళ్లు: బ్రాండన్ మెక్‌ముల్లెన్, డేవిడ్ విల్లీ, జేక్ లింటాట్, జోష్ లిటిల్, లారీ ఎవాన్స్, మైఖేల్ పెప్పర్, రవి బొపారా, సామ్ హైన్

రిటెన్షన్స్: అలీ ఖాన్, ఆండ్రీ రసెల్, చరిత్ అసలంక, జో క్లార్క్, సాబిర్ అలీ, సునీల్ నరైన్, మర్చంట్ డి లాంజ్‌, మతియుల్లా ఖాన్

డెజర్ట్‌ వైపర్స్

కొత్త ఆటగాళ్లు: ఆడమ్ హోస్, ఆజం ఖాన్, బాస్ డి లీడ్‌, మైఖేల్ జోన్స్, షాదాబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రిది

రిటెన్షన్స్‌: అలెక్స్ హేల్స్, అలీ నసీర్, కొలిన్ మున్రో, దినేష్ చండిమాల్, గుస్ అట్కిన్సన్, ల్యూక్ వుడ్, మతీష పతిరణ, రోహన్ ముస్తఫా, షెల్డన్ కాట్రెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, టామ్ కర్రన్, వనిందు హసరంగ

దుబాయ్ క్యాపిటల్స్‌

కొత్త ఆటగాళ్లు: ఆండ్రూ టై, దసున్ షనక, డేవిడ్ వార్నర్, మార్క్ వుడ్, మాక్స్ హోల్డెన్, మొహమ్మద్ మొహ్సిన్, రహ్మానుల్లా గుర్బాజ్, నువాన్ తుషార, రోల్ఫ్‌ వాన్ డెర్ మెర్వ్‌, సదీర సమరవిక్రమ, సామ్ బిల్లింగ్స్

రిటెన్షన్స్: దుష్మంత చమీర, జో రూట్, రాజా అకిఫ్, రోవ్‌మన్ పావెల్, సికందర్ రజా

గల్ఫ్ జెయింట్స్

కొత్త ఆటగాళ్లు: డొమినిక్ డ్రేక్స్, జోర్డాన్ కాక్స్, కరీం జనత్, ముజీబ్-ఉర్-రెహ్మాన్, సౌరభ్ నేత్రవల్కర్

రిటెన్షన్స్: అయాన్ అఫ్జల్ ఖాన్, కార్లోస్ బ్రాత్‌వైట్, క్రిస్ జోర్డాన్, క్రిస్ లిన్, గెర్హార్డ్ ఎరాస్మస్, జేమ్స్ విన్స్, జేమీ ఓవర్టన్, రెహాన్ అహ్మద్, రిచర్డ్ గ్లీసన్, సంచిత్ శర్మ, షిమ్రాన్ హెట్మైర్

ఎంఐ ఎమిరేట్స్

కొత్త ఆటగాళ్లు: అకీల్ హోసేన్, అంబటి రాయుడు, కోరె అండర్సన్, కుశాల్ పెరీరా, నోస్తుష్ కెంజిగే, ఓడియన్ స్మిత్, విజయకాంత్ వియాస్కాంత్, వకార్ సలాంఖైల్

రిటెన్షన్స్: ఆండ్రీ ఫ్లెచర్, డేనియల్ మౌస్లీ, డ్వేన్ బ్రేవో, ఫజల్‌ హాక్ ఫారూకీ, జోర్డాన్ థాంప్సన్, కీరన్ పొలార్డ్, మెక్‌కెన్నీ క్లార్క్, ముహమ్మద్ వసీమ్, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, విల్ స్మీడ్, జహూర్ ఖాన్

షార్జా వారియర్స్

కొత్త ఆటగాళ్లు: క్రిస్ సోల్, డేనియల్ సామ్స్, దిల్షన్ మధుశంక, జేమ్స్ ఫుల్లర్, జాన్సన్ చార్లెస్, కుశాల్ మెండిస్, లూయిస్ గ్రెగొరీ, మహేశ్ తీక్షణ, మార్క్ వాట్, మార్టిన్ గప్తిల్, సీన్ విలియమ్స్, కైస్ అహ్మద్

రిటెన్షన్స్: క్రిస్ వోక్స్, జో డెన్లీ, జునైద్ సిద్ధిక్, మార్క్ దెయాల్, ముహమ్మద్ జవాదుల్లా, టామ్ కోహ్లర్-కాడ్మోర్

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)