Breaking News

పాక్‌ హెడ్‌కోచ్‌గా అంటే కత్తి మీద సాము లాంటిదే: డేవ్ వాట్‌మోర్

Published on Tue, 07/23/2024 - 11:47

వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఘోర పరాభావం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ కోచింగ్ స్టాప్ మొత్తాన్ని ప్రక్షాళన చేసిన సంగతి తెలిసిందే. పాక్ జట్టు పరిమిత ఓవర్ల హెడ్‌కోచ్‌గా ద‌క్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గ‌జం గ్యారీ కిర్‌స్టెన్ బాధ్యతలు చేపట్టగా.. టెస్టు జట్టు ప్రధాన కోచ్‌గా ఆసీస్ ఫాస్ట్ బౌలింగ్ లెజెండ్ జాసన్ గిల్లెస్పీ ఎంపికయ్యాడు.

గ్యారీ కిర్‌స్టెన్ ఇప్పటికే తన ప్రయణాన్ని ప్రారంభించగా..  వ‌చ్చే నెల‌లో స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో జ‌రిగే టెస్టు సిరీస్‌తో గిల్లెస్పీ ప్రస్ధానం మొద‌లు కానుంది. అయితే కోచ్‌లు మారినప్పటకి పాక్ తల రాత ఏమాత్రం మారలేదు. కిర్‌స్టెన్ నేతృత్వంలోని పాక్ జట్టు టీ20 వరల్డ్‌కప్‌-2024లో దారుణ ప్రదర్శన కనబరిచింది. 

గ్రూపు స్టేజిలోనే పాక్ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో పాక్ జట్టుతో పాటు పీసీబీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా పాకిస్థాన్ మాజీ ప్రధాన కోచ్ డేవ్ వాట్‌మోర్ కొత్త హెడ్‌కోచ్‌లు గ్యారీ కిర్‌స్టెన్‌, జాసన్ గిల్లెస్పీలకు కీలక సూచనలు చేశాడు. పాక్ జట్టును విజయం పథంలో నడిపించడం అంత ఈజీ కాదని వాట్‌మోర్ అభిప్రాయపడ్డాడు.

"ఇప్పటికే పాక్ సెలక్షన్ కమిటీ చాలా మార్పుల చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు వల్ల పాక్ క్రికెట్‌కు ఎంత నష్టం జరుగుతుంతో వేచి చూడాలి. నావరకు నేను ఆదృష్టవంతుడిని. ఎందుకంటే పాక్ జట్టు హెడ్‌కోచ్‌గా నా పదవీకాలాన్ని మొత్తాన్ని పూర్తి చేసే అవకాశం దక్కింది. 

ఈ మధ్య కాలంలో పాక్‌కు కోచ్‌లు మారుతునే ఉన్నారు. కొత్త కోచ్‌లకు నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రశాంతంగా ఉండి తమ పని తాము చేసుకుపోవాలి. ఏదేమైనప్పటకి పాక్ జట్టు హెడ్ కోచ్‌గా పనిచేయడం అంత సులభం కాదు" అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్‌మోర్ పేర్కొన్నాడు. కాగా 2012లో పాక్‌ జట్టుహెడ్‌ కోచ్‌గా వాట్‌మోర్‌ పనిచేశాడు.

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)