Breaking News

మెద్వెదెవ్‌ విజయం

Published on Wed, 11/13/2024 - 03:21

ట్యూరిన్‌ (ఇటలీ): టాప్‌ టెన్నిస్‌ స్టార్ల మధ్య జరుగుతున్న ఏటీపీ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో రష్యా ప్లేయర్‌ డానిలి మెద్వెదెవ్‌ రెండో లీగ్‌ మ్యాచ్‌లో గెలిచి గట్టెక్కాడు. మంగళవారం జరిగిన పోరులో మెద్వెదెవ్‌ 6–2, 6–4తో అలెక్స్‌ డి మినార్‌ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగిన పోరులో వరుస సెట్లలో టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా) చేతిలో కంగుతిన్న రష్యన్‌ స్టార్‌ ఈ సారి ఆ పొరపాటు చేయలేదు. 

ఆరంభం నుంచే తన రాకెట్‌కు పదును పెట్టిన మెద్వెదెవ్‌ ఆస్ట్రేలియా ప్రత్యర్థిపై అలవోక విజయం సాధించాడు. ఆసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) టాప్‌–8 ర్యాంకింగ్‌ ప్లేయర్లను గ్రూపులో నలుగురు చొప్పున విభజించి  రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో ఈ సీజన్‌ ముగింపు టోర్నీని నిర్వహిస్తారు. ఒక్కో గ్రూప్‌ నుంచి తొలిరెండు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు సెమీఫైనల్స్‌కు అర్హత సంపాదిస్తారు. 

గురువారం జరిగే పోటీల్లో సినెర్‌తో మెద్వెదెవ్, ఫ్రిట్జ్‌తో డి మినార్‌ తలపడతారు. మరో గ్రూప్‌ మ్యాచ్‌లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6–4, 6–4తో రుబ్లెవ్‌ (రష్యా)పై గెలుపొందాడు. డబుల్స్‌ పోరులో ఏడో సీడ్‌ హ్యారి హెలియోవార (ఫిన్లాండ్‌)–హెన్రీ ప్యాటెన్‌ (బ్రిటన్‌) జోడీ 7–6 (8/3), 7–5తో ఆస్ట్రేలియాకు చెందిన ఐదో సీడ్‌ జోర్డాన్‌ థాంప్సన్‌–మ్యాక్స్‌ పుర్సెల్‌ జంటపై గెలుపొందింది.  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)