Breaking News

అప్పుడు నాన్న.. అమ్మతో వచ్చారు.. కానీ ఈసారి: కమిన్స్‌ భావోద్వేగం

Published on Wed, 06/21/2023 - 21:28

England vs Australia, 1st Test: ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. 2019లో తన తండ్రి.. తల్లితో పాటు మ్యాచ్‌ చూడటానికి వచ్చారని.. ఇప్పుడు లండన్‌లో ఆయన ఒక్కరే ఉన్నారని ఉద్వేగానికి గురయ్యాడు. కాగా టీమిండియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023తో బిజీగా ఉన్న సమయంలో ప్యాట్‌ కమిన్స్‌ ఉన్నఫళంగా ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిన విషయం తెలిసిందే.

బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లి బాగోగులు చూసుకునేందుకు టెస్టు సిరీస్‌ మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే కమిన్స్‌ తల్లి కన్నుమూసింది. అయితే, తాను ఎంతగానో ప్రేమించే మాతృమూర్తిని కోల్పోయిన బాధ నుంచి కమిన్స్‌ ఇంకా బయటపడలేకపోతున్నాడు.

ఇదిలా ఉంటే.. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌ తర్వాత ఆసీస్‌ నేరుగా టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడింది. ఇంగ్లండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కమిన్స్‌.. మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక కమిన్స్‌ సారథ్యంలోని ఆసీస్‌.. ఈ ప్రతిష్టాత్మక ఫైనల్లో 209 పరుగుల భారీ తేడాతో రోహిత్‌ సేనను ఓడించింది.

తద్వారా సంప్రదాయ క్రికెట్‌లోనూ విశ్వవిజేతగా అవతరించింది. ఇక ఈ మ్యాచ్‌ ముగియగానే ఆసీస్‌.. ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలో జూన్‌ 16-20 వరకు జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో కమిన్స్‌ 4 వికెట్లు తీయడంతో పాటు.. కీలక సమయంలో 44 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం కమిన్స్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘వ్యక్తిగతంగా.. గత కొన్నిరోజులుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా.

అయితే, ఈ వారం మొత్తం నాన్న, నా సోదరుడు నాతో పాటే ఉన్నారు. 2019లో నాన్న అమ్మతో పాటు వచ్చారు. కానీ ఇప్పుడు ఇలా!.. మరేం పర్లేదు ఆయన నాతో ఉండటం స్పెషల్‌.. లక్కీగా ఫీలవుతున్నా’’ అని ఎమోషనల్‌ అయ్యాడు.

చదవండి: Ravindra Jadeja: పాపం! జడేజా మనసు గాయపడి ఉంటుంది.. సీఎస్‌కే సీఈఓ కామెంట్స్‌ వైరల్‌

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)