Breaking News

18 ఏళ్లకే వరల్డ్‌ చెస్‌ ఛాంపియన్‌.. కన్నీరు పెట్టుకున్న గుకేశ్‌! వీడియో

Published on Fri, 12/13/2024 - 10:11

ప్రపంచ చదరంగంలో భారత గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ కొత్త అధ్యయనాన్ని లిఖించాడు. సింగ్‌పూర్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చైనా గ్రాండ్ మాస్టర్‌ను ఓడించి గుకేశ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. త‌ద్వారా ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన అతిపిన్న వయస్సు ఆటగాడిగా గుకేశ్ చ‌రిత్ర సృష్టించాడు.

కేవలం 18 ఏళ్ల వయస్సులోనే వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి విశ్వవేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. అద్బుతమైన చెక్‌మెట్‌లతో డిఫెండింగ్ ఛాంపియన్‌నే ఈ యువ గ్రాండ్ మాస్టర్ ఓడించాడు. ఈ క్రమంలో 140 కోట్ల మంది భారతీయులు గుకేశ్ విజయాన్ని కొనియాడుతున్నారు.

కన్నీరు పెట్టుకున్న గుకేశ్‌..
ఆఖరి గేమ్‌లో విజయం ఖాయమైన అనంతరం గుకేశ్ భావోద్వేగానికి లోనయ్యాడు. చదరంగం బోర్డుపై పావులను సరిచేస్తూ గుకేశ్ కన్నీరు పెట్టుకున్నాడు. అయితే గెలిచిన వెంటనే పక్కన వున్నవారు చప్పట్లు కొట్టి అభినందిచండంతో గుకేశ్ నవ్వుతూ కన్పించాడు.

ఆ తర్వాత తన సీట్ నుంచి లేచి విన్నింగ్ సెలబ్రేషన్స్‌ను అతడు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చెస్‌.కామ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

గుకేశ్‌ తండ్రి టెన్షన్‌ టెన్షన్‌..

మరోవైపు లోపల ఫైనల్ గేమ్ జరుగుతుండగా గుకేశ్ తండ్రి రజనీకాంత్ సైతం తెగ టెన్షన్ పడ్డారు. గది బయట ఫోన్ చూసుకుంటూ అతడు ఆందోళనతో అటు ఇటు తిరుగుతూ కన్పించాడు. అయితే గుకేశ్‌ గెలిచిన వెంటనే రజనీకాంత్ అనందానికి అవధలు లేకుండా పోయాయి.

తన కొడుకుని ఆలింగనం చేసుకుంటూ గెలుపు సంబరాలు జరుపునకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అదే విధంగా గుకేశ్ తన ఫ్యామిలీతో డ్యాన్స్‌ చేస్తున్న ఓ పాత వీడియోను ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో షేర్ చేశాడు. "ఇప్పుడు యావత్‌ భారత్‌ మొత్తం మీతో కలిసి డ్యాన్స్‌ చేస్తుందని" ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చాడు. 

 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)