Breaking News

నా కల నిజమైంది: గుకేశ్‌

Published on Fri, 12/13/2024 - 08:10

‘లిరెన్‌ 55వ ఎత్తు తర్వాత నేను ఏం వేయాలో అప్పటికే సిద్ధమైపోయా. ఇక ఎత్తు వేయడమే తరువాయి. అయితే ఒక్కసారిగా అతని అడుగు నన్ను ఆశ్చర్యపరిచింది. దానిని వెంటనే నమ్మలేకపోయా. కానీ నా జీవితంలో అత్యుత్తమ క్షణం వచ్చేసిందని అప్పుడే అర్థమైపోయింది. 

ఆరేళ్ల వయసులో చెస్‌ మొదలు పెట్టాను. గత పదేళ్లుగా ఇదే కల నన్ను నడిపించింది. ప్రతీ ఆటగాడు ఇలాంటి స్థాయిని అందుకోవాలని ఆశిస్తాడు. కానీ కొందరికే అవకాశం దక్కుతుంది. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. 2013లో ఆనంద్, కార్ల్‌సన్‌ మధ్య పోరును చెన్నైలోని ఆడిటోరియంలో కూర్చొని చూసేందుకు చోటు దొరకలేదు. 

దాంతో గాజు తెర బయట నిలబడ్డా. ఇప్పుడు అలాంటి తరహాలో భారత జెండా పక్కన పెట్టుకొని పోటీ పడటం గర్వంగా అనిపించింది. కార్ల్‌సన్‌ టైటిల్‌ సాధించిన సమయంలో దానిని మళ్లీ భారత్‌కు అందించే ఆటగాడిని నేనే కావాలని కోరుకున్నా. 

అధికారికంగా నా టీమ్‌లో ఆనంద్‌ సర్‌ భాగస్వామి కాకపోయినా ఆయన అన్ని విధాలా నాకు సహకరించారు. నా శిక్షణ శిబిరానికి కూడా వచ్చారు. నాకు దేవుడిపై నమ్మకం ఉంది.

 గత ఏడాది నేను క్యాండిడేట్స్‌కు అర్హత కూడా సాధించలేకపోయినా ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి. టైటిల్‌ గెలవగానే అమ్మకు ఫోన్‌ చేశాను. ఇద్దరమూ ఏడుస్తున్నాం తప్ప ఏమీ మాట్లాడుకోలేకపోయాం. నా తల్లిదండ్రులు నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. 

చెస్‌ను ఆస్వాదిస్తుంటే చాలు ఏదో ఒక రోజు లక్ష్యం చేరవచ్చు. 12 గేమ్‌ల వరకు కూడా సరిగ్గా నిద్రపోలేదు. కానీ ప్యాడీ ఆప్టన్‌ సూచనలు నన్ను ప్రశాంతంగా మార్చాయి. హాయిగా పడుకోగలిగాను. అందుకే తర్వాతి రెండు గేమ్‌లలో ఉత్సాహంగా ఉన్నాను. ఇది గెలవగానే నేను ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిని అయిపోలేదు. 

కార్ల్‌సన్‌ ఎలాగూ ఉన్నాడు. అతనితో తలపడాలని నాకూ ఉంది. చెస్‌లో అదే అత్యంత పెద్ద సవాల్‌. అయితే అది అతని ఇష్టంపై ఆధారపడి ఉంది.  అతడిని స్ఫూర్తిగా తీసుకొనే అతని స్థాయిని అందుకోవాలనుకుంటున్నా’ అని విజయనంతరం  మీడియా సమావేశంలో గుకేశ్‌ పేర్కొన్నాడు
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)