Breaking News

వాళ్లు వచ్చిన తరువాతే ఆడతామన్నారు...

Published on Fri, 09/13/2024 - 11:22

బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా 45వ చెస్‌ ఒలింపియాడ్ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో చెక్ రిపబ్లిక్ జట్టు తమ మంచి మనసును చాటుకుంది. భారత్‌తో మ్యాచ్ సందర్భంగా చెక్ రిపబ్లిక్ గ్రాండ్‌మాస్టర్లు అద్భుతమైన క్రీడా స్పూర్తిని ప్రదర్శించి అందరితో శెభాష్ అనిపించుకుంటున్నారు.

అసలేం ఏం జరిగిందంటే?
ఈ టోర్నీలో భాగంగా భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు గురువారం త‌మ రెండో రౌండ్ మ్యాచ్‌లో  SYMA స్పోర్ట్స్ అండ్ కాన్ఫరెన్స్ సెంటర్ వేదిక‌గా చెక్ రిపబ్లిక్‌తో త‌ల‌ప‌డింది. అయితే తానియా సచ్‌దేవ్, హారిక ద్రోణవల్లి, వంటికా అగర్వాల్‌,  దివ్య దేశ్‌ముఖ్‌లతో కూడిన భారత బృందం.. వేదిక వద్దకు చేరుకోవడం కాస్త ఆలస్యమైంది.

ట్రావిలింగ్‌లో సమస్యల కారణంగా రెండు బృందాలుగా వేదిక వద్దకు చేరుకున్నారు. టీమిండియాలోని కొంతమంది సభ్యులు వేదిక వద్దకు వచ్చిన వెంటనే టోర్నమెంట్ అధికారులు చెక్ రిపబ్లిక్ ఆటగాళ్లను గడియారం(క్లాక్‌)ను ప్రారంభించాలని సూచించారు. 

సరిగ్గా ఇదే సమయంలో చెక్ రిపబ్లిక్ జట్టు తమ క్రీడా స్పూర్తిని చాటుకుంది. భారత జట్టు మొత్తం సభ్యులందరూ వచ్చేవరకు తమ గడియారాలను ప్రారంభించకూడదని వారు నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత సభ్యులందరూ వచ్చాక గేమ్‌ ప్రారంభమైంది.  అయితే ఈ రెండో రౌండ్‌లో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చెక్‌ రిపబ్లిక్‌పై 3.5-05 తేడాతో విజయం సాధించారు.
చదవండి: అంతా అనుకున్నట్టే జరిగింది.. న్యూజిలాండ్‌- అఫ్గాన్ టెస్టు రద్దు

 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)