Breaking News

మిచౌంగ్‌ ఎఫెక్ట్‌: విశాఖలో లెజెండ్స్‌ మ్యాచ్‌ రద్దు.. ఇక్కడ గెలిచిన జట్లు ఇవే

Published on Mon, 12/04/2023 - 18:34

Urbanrisers Hyderabad vs Manipal Tigers: మిచౌంగ్‌ తుపాను ప్రభావం లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌పై పడింది. విశాఖపట్నంలో సోమవారం జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. ఈ విషయాన్ని నిర్వాహకులు వెల్లడించారు. కాగా లెజెండ్స్‌ టీ20 లీగ్‌ తాజా సీజన్‌లో భాగంగా విశాఖలో మూడు మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

ఇందులో భాగంగా పీఎం పాలెంలో ఉన్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరిగింది. డిసెంబరు 2న ఇండియా క్యాపిటల్స్‌- మణిపాల్‌ టైగర్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో గౌతం గంభీర్‌ ఇండియా క్యాపిటల్స్‌ సేన.. హర్భజన్‌ సింగ్‌ సారథ్యంలోని మణిపాల్‌ చేతిలో ఓడిపోయింది.

ఇక డిసెంబరు 3 నాటి మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌- సదరన్‌ సూపర్‌ స్టార్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో నగరంలో ఆఖరిదైన మ్యాచ్‌ అర్బన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌- మణిపాల్‌ టైగర్స్‌ మధ్య  సోమవారం సాయంత్రం జరగాల్సి ఉంది. అయితే, తుపాను మిచౌంగ్‌ కారణంగా వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.

ఇక ఈ టోర్నమెంట్‌లో భాగంగా తదుపరి మ్యాచ్‌లు ఆడేందుకు క్వాలిఫై అయిన గుజరాత్‌ జెయింట్స్‌, మణిపాల్‌ టైగర్స్, అర్బన్‌ రైజర్స్‌ హైదరాబాద్, ఇండియా క్యాపిటల్‌ జట్లు సూరత్‌కు బయలుదేరి వెళ్లనున్నాయి.

చదవండి: భారత్‌కు తిరిగి వచ్చిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. వీడియో వైరల్‌

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)