Breaking News

CWC 2023: లీగ్‌ దశ ముగిసాక పరిస్థితి ఇది.. విరాట్‌, జంపా టాప్‌లో..!

Published on Tue, 11/14/2023 - 07:34

భారత్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌తో వన్డే వరల్డ్‌కప్‌ 2023 రౌండ్‌ రాబిన్‌ (లీగ్‌) దశ మ్యాచ్‌లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచిన భారత్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌.. బుధవారం (నవంబర్‌ 15) జరిగే తొలి సెమీఫైనల్లో (ముంబై) నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటుంది.

పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికా.. నవంబర్‌ 16న జరిగే రెండో సెమీఫైనల్లో (కోల్‌కతా) మూడో స్థానంలో ఉన్న జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అనంతరం ఈ రెండు సెమీస్‌లో గెలిచే జట్లు అహ్మదాబాద్‌ వేదికగా నవంబర్‌ 19న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. 

లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా విరాట్‌..
రౌండ్‌ రాబిన్‌ దశ మ్యాచ్‌లు ముగిసాక టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ దశలో విరాట్‌ 9 మ్యాచ్‌లు ఆడి 2 శతకాలు, 5 అర్ధశతకాల సాయంతో 99 సగటున 594 పరుగులు చేశాడు. ఈ జాబితాలో డికాక్‌ (9 మ్యాచ్‌ల్లో 591 పరుగులు), రచిన్‌ రవీంద్ర (9 మ్యాచ్‌ల్లో 565 పరుగులు), రోహిత్‌ శర్మ (9 మ్యాచ్‌ల్లో 503 పరుగులు), డేవిడ్‌ వార్నర్‌ (9 మ్యాచ్‌ల్లో 499 పరుగులు) టాప్‌-5లో ఉన్నారు. లీగ్‌ దశలో డికాక్‌ 4 సెంచరీలతో టాప్‌లో ఉండగా.. రచిన్‌ 3, విరాట్‌, వార్నర్‌, డస్సెన్‌, మిచెల్‌ మార్ష్‌, మ్యాక్స్‌వెల్‌ తలో 2 సెంచరీలు చేశారు. 

టాప్‌లో జంపా..
రౌండ్‌ రాబిన్‌ దశ మ్యాచ్‌లు ముగిసాక ఆసీస్‌ స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. జంపా 9 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో మధుషంక (9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు), షాహీన్‌ అఫ్రిది (9 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు), గెరాల్డ్‌ కొయెట్జీ (7 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు), జస్ప్రీత్‌ బుమ్రా (9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) టాప్‌-5లో నిలిచారు. భారత బౌలర్లు జడేజా (9 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు), షమీ (5 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు) ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)