Breaking News

CWC 2023: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌.. మరో భారీ స్కోర్‌పై కన్నేసిన సౌతాఫ్రికా

Published on Tue, 10/17/2023 - 12:11

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సౌతాఫ్రికా.. ఇవాళ (అక్టోబర్‌ 17) పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో సఫారీలు మరో భారీ స్కోర్‌పై కన్నేశారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అతి భారీ స్కోర్లు చేసిన సౌతాఫ్రికా.. ఇవాళ జరిగే మ్యాచ్‌లోనూ భారీ స్కోర్‌ చేయడం​ ఖాయమని తెలుస్తుంది. ధర్మశాల పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం కావడంతో ఈ ఎడిషన్‌లో దక్షిణాఫ్రికా మరోసారి 400 స్కోర్‌ను దాటడం ఖాయమని అభిమానులు అంటున్నారు. సఫారీ ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌ ప్రకారం 400 స్కోర్‌ వారికి పెద్ద లెక్క కాకపోచ్చు. ఓ మోస్తరుగా ఉండే నెదర్లాండ్స్‌ బౌలింగ్‌పై సఫారీ హిట్టర్లు ప్రతాపం చూపవచ్చు. 

శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో డికాక్‌ (100), డస్సెన్‌ (108), మార్క్రమ్‌ (106) సెంచరీలతో స్వైరవిహారం చేయడంతో 428 పరుగులు స్కోర్‌ చేసిన సఫారీ టమ్‌.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 300కుపైగా స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో డికాక్‌ మరోసారి శతక్కొట్టడంతో (109) సౌతాఫ్రికా 311 పరుగులు స్కోర్‌ చేసింది.  

వరుణుడు అడ్డుతగులుతాడా..?
ధర్మశాలలో ఇవాళ ఉదయం నుంచి జల్లులు కురుస్తున్నాయి. వాతావరణం చాలా ఆహ్లాదంగా, క్రికెట్‌కు అనుకూలంగా ఉంది. అయితే ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకుని ఉండటంతో ఏ క్షణంలో అయినా భారీ వర్షం పడే అవకాశం ఉంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదమయితే లేదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పిచ్‌ స్వభావంలో స్వల్పంగా మార్పులు జరుగవచ్చు. 

సౌతాఫ్రికాకు సంపూర్ణ ఆధిపత్యం..
సౌతాఫ్రికా-నెదర్లాండ్స్‌ జట్లు ఇప్పటివరకు వన్డేల్లో 7 సార్లు ఎదురెదురుపడగా.. 6 సందర్భాల్లో సౌతాఫ్రికానే విజయం సాధించింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లో ఈ ఇరు జట్లు ఇప్పటివరకు ఎదురెదురుపడలేదు. వరల్డ్‌కప్‌లో ఇరు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్‌ అవుతుంది. కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 102 పరుగుల తేడాతో.. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 134 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)