CWC 2023 AUS VS NZ: విరాట్‌ కోహ్లిని దాటేసిన రచిన్‌ రవీంద్ర

Published on Sat, 10/28/2023 - 17:52

ప్రస్తుత ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ భవిష్యత్తు తార రచిన్‌ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ శతకం (ఇంగ్లండ్‌పై 82 బంతుల్లో శతకం​) బాదిన రచిన్‌.. ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో విధ్వంసకర శతకం బాది పరుగుల వరద పారిస్తున్నాడు. ఆసీస్‌తో మ్యాచ్‌లో కేవలం 77 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతక్కొట్టిన రచిన్‌.. 116 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఈ టోర్నీ రచిన్‌ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 406 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో రచిన్‌ టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లిని అధిగమించాడు. టోర్నీలో అత్యధిక​ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్‌ (5 మ్యాచ్‌ల్లో 354 పరుగులు) నాలుగో స్థానంలో ఉండగా.. రచిన్‌ ఈ మ్యాచ్‌లో చేసిన పరుగులతో కోహ్లిని వెనక్కునెట్టాడు (ఐదో స్థానానికి).

ఈ జాబితాలో క్వింటన్‌ డికాక్‌ (6 మ్యాచ్‌ల్లో 431 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. వార్నర్‌ (6 మ్యాచ్‌ల్లో 413) రెండు, మార్క్రమ్‌ (6 మ్యాచ్‌ల్లో 356) నాలుగో స్థానంలో నిలిచారు. 

కాగా, ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ నిర్ధేశించిన 389 పరుగుల అతి భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ పోరాడుతుంది. ఈ జట్టు 43 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసి లక్ష్యానికి 75 పరుగుల దూరంలో (42 బంతుల్లో) ఉంది. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. 

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. డేవిడ్‌ వార్నర్‌ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్‌ హెడ్‌ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో శివాలెత్తడంతో 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్‌వెల్‌ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జోష్‌ ఇంగ్లిస్‌ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్‌), పాట్‌ కమిన్స్‌ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)