WC 2023 Eng Vs NZ: టాస్‌ గెలిచిన కివీస్‌.. ఇంగ్లండ్‌కు షాక్‌

Published on Thu, 10/05/2023 - 13:33

ICC Cricket World Cup 2023- England vs New Zealand: వన్డే వరల్డ్‌కప్‌-2023కు తెరలేచింది. భారత్‌ వేదికగా పుష్కరకాలం తర్వాత మెగా టోర్నీ ఆరంభమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం.. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌- గత ఎడిషన్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది.

ఇంగ్లండ్‌కు షాక్‌.. స్టోక్స్‌ లేకుండానే
టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఇక 2019 వరల్డ్‌కప్‌ హీరో బెన్‌ స్టోక్స్‌ లేకుండానే ఇంగ్లండ్‌.. కివీస్‌తో బరిలోకి దిగనుంది. గాయం వేధిస్తున్న క్రమంలో అతడు జట్టుకు దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బ. 

వాళ్లు ముగ్గురూ మిస్‌
కాగా కొన్నాళ్ల క్రితం 50 ఓవర్ల ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టోక్స్‌.. ఇంగ్లండ్‌ బోర్డు విజ్ఞప్తి మేరకు తన నిర్ణయం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గైర్హాజరీలో టామ్‌ లాథమ్‌ న్యూజిలాండ్‌కు సారథ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా.. లాథమ్‌ మాట్లాడుతూ.. ‘‘టోర్నీ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం.  

పిచ్‌ బాగుంది. పాతబడే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనుకుంటున్నాం. అందుకే తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాం. దురదృష్టవశాత్తూ కేన్‌ ఇంకా మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధం కాలేదు. ఫెర్గూసన్‌ని గాయం వేధిస్తోంది.  ఇష్‌ సోధి, కేన్‌ విలియమ్సన్‌, టిమ్‌ సౌతీ ఈరోజు మిస్సయ్యారు’’ అని పేర్కొన్నాడు.

తుది జట్లు:
న్యూజిలాండ్‌

డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్/ కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్‌, మాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్

ఇంగ్లండ్‌
జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్‌ కీపర్‌), లియామ్ లివింగ్‌స్టోన్‌, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

చదవండి: WC 2023: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్‌? ఆ బద్దకస్తులు అంతే! మనోళ్లు మాత్రం.. 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)