Breaking News

మళ్లీ శతక్కొట్టిన సీవీ ఆనంద్‌

Published on Sun, 10/19/2025 - 19:39

తెలంగాణ హోం శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరి, హైదరాబాద్‌ నగర మాజీ పోలీస్‌ కమిషర్‌ సీవీ ఆనంద్‌ మంచి క్రికెటర్‌ అన్న విషయం మనలో చాలామందికి తెలీకపోవచ్చు.

సీవీ ఆనంద్‌ అండర్‌-19 క్రికెట్‌లో భారత జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. అలాగే అండర్‌-19, 22 విభాగాల్లో హైదరాబాద్‌ జట్టుకు కూడా ఆడారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో చాలా టోర్నీల్లో పాల్గొన్నారు.

ఇండియన్‌ పోలీస్‌ సర్వీసెస్‌కు ఎంపిక కావడంతో సీవీ ఆనంద్‌ క్రికెటింగ్‌ కెరీర్‌కు బ్రేక్‌ పడింది. అయినా వీలు చిక్కినప్పుడల్లా క్రికెట్‌ ఆడుతుంటారు.

తాజాగా సీవీ ఆనంద్‌ హెచ్‌సీఏ ‘సి’ డివిజన్‌ వన్డే లీగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సికింద్రబాద్‌ క్లబ్‌కు ఆడుతూ మెరుపు సెంచరీ చేశారు. వారం రోజుల వ్యవధిలో అతనికి ఇది రెండో సెంచరీ.

గత ఆదివారం బేగంపేటలో హెచ్‌పీఎస్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 89 బంతుల్లో 111 పరుగులు చేసిన ఆనంద్‌.. తాజాగా సికింద్రబాద్‌ క్లబ్‌లో తారకరామ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 94 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశారు.

ఈ మ్యాచ్‌లో సికింద్రబాద్‌ క్లబ్‌ జట్టు 36 పరుగుల తేడాతో తారకరామ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సికింద్రబాద్‌.. సీవీ ఆనంద్‌ శతక్కొట్టడంతో 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 270 పరగులు చేసింది. ఛేదనకు దిగిన తారకరామ జట్టు 34.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది.

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)