Breaking News

టాస్‌ ఓడిపోవడమే మంచిదైంది.. అతడు నా ఫేవరేట్‌ ప్లేయర్‌: కమ్మిన్స్‌

Published on Mon, 06/12/2023 - 08:26

వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2021-23 టైటిల్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓవల్‌ వేదికగా టీమిండియాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 209 పరుగుల భారీ తేడాతో ఆసీస్‌ విజయం సాధించింది.

తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల(వన్డే, టి20, టెస్టులు) ఐసీసీ ట్రోఫీలు అందుకున్న తొలి జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. ఇక చారిత్రత్మక విజయంపై మ్యాచ్‌ అనంతరం ఆసీస్‌ కెప్టెప్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ స్పందించాడు.  ఈ మ్యాచ్‌లో అదరగొట్టిన బోలాండ్‌పై కమ్మిన్స్‌ ప్రశంసల వర్షం​ కురిపించాడు.

"ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిపోవడమే మంచిదైంది. లేకపోతే మేమూ బౌలింగ్‌ తీసుకునేవాళ్లం. కొన్నిసార్లు భారత్‌ ప్రతిఘటించినా, ఎక్కువ భాగం మేమే ఆధిపత్యం ప్రదర్శించాం. మాకు సంబంధించి ఇదో మధుర క్షణం. ఈ విజయాన్ని కొన్ని రోజులు ఆస్వాదించిన తర్వాతే యాషెస్‌ గురించి ఆలోచిస్తాం. ఈ మ్యాచ్‌లో బోలాండ్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

బోలాండ్‌ నా ఫేవరేట్‌ ప్లేయర్‌. హెడ్‌, స్టీవ్‌ కూడా అత్యుత్తమ ప్రదర్శన చేశారు. ఇక  ఫైనల్‌ ఒక్క మ్యాచ్‌ ఉండటమే మంచిది. అనుకంటే 50 మ్యాచ్‌ల సిరీస్‌ కూడా ఆడవచ్చు. ఒలింపిక్స్‌లో ఒక్క రేస్‌ గెలిస్తేనే స్వర్ణం దక్కుతుంది కదా అని" పోస్ట్‌ మ్యాచ్‌ కాన్పరెన్స్‌లో కమ్మిన్స్‌పేర్కొన్నాడు.
చదవండి: WTC Final: ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి.. కోహ్లి క్రిప్టిక్ పోస్ట్! మౌనమే అంటూ

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)