Breaking News

రొనాల్డో అరుదైన ఘనత.. గిన్నిస్‌ రికార్డుతో చరిత్ర! అతడి తర్వాత..

Published on Thu, 06/22/2023 - 10:08

Cristiano Ronaldo World Record- రెక్‌జావిక్‌ (ఐస్‌లాండ్‌): పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ జట్టు  దిగ్గజం, స్టార్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయి అందుకున్నాడు. పురుషుల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ చరిత్రలో జాతీయ జట్టు తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యూరో–2024 చాంపియన్‌షిప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా గ్రూప్‌ ‘జె’లో ఐస్‌లాండ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో బరిలోకి దిగడంద్వారా 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.

38 ఏళ్ల రొనాల్డో ఆట 89వ నిమిషంలో చేసిన గోల్‌తో ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ 1–0తో ఐస్‌లాండ్‌ను ఓడించింది. గ్రూప్‌ ‘జె’లో పోర్చుగల్‌కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన రికార్డు కూడా రొనాల్డో (123 గోల్స్‌) పేరిటే ఉంది. మ్యాచ్‌కు ముందు రొనాల్డో ఘనతకు గుర్తింపుగా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ సంస్థ సర్టిఫికెట్‌ను అందజేసింది.

2003 నుంచి పోర్చుగల్‌ జాతీయ సీనియర్‌ జట్టుకు ఆడుతున్న రొనాల్డో వరుసగా ఐదు ప్రపంచకప్‌లలో గోల్స్‌ చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు. రొనాల్డో కెప్టెన్సీలో పోర్చుగల్‌ 2016 తొలిసారి యూరో చాంపియన్‌గా అవతరించింది. ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌లో స్పోర్టింగ్‌ సీపీ, మాంచెస్టర్‌ యునైటెడ్, రియల్‌ మాడ్రిడ్, యువెంటస్‌ జట్లకు ఆడిన రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియా ప్రొ లీగ్‌లో అల్‌ నాసర్‌ క్లబ్‌ జట్టుకు ఆడుతున్నాడు. 

జాతీయ జట్టుకు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్‌–10 ఆటగాళ్లు 
ప్లేయర్‌ -                   దేశం         - మ్యాచ్‌లు 
రొనాల్డో    -                పోర్చుగల్‌   -   200 
బదర్‌ అల్‌ ముతవా  -  కువైట్‌   -    196 
సో చిన్‌ అన్‌ -             మలేసియా  -     195 
అహ్మద్‌ హసన్‌ -          ఈజిప్ట్‌     -  184 
అహ్మద్‌ ముబారక్‌-     ఒమన్‌   -    183 
సెర్జియో రామోస్‌-     స్పెయిన్‌  -     180 
ఆండ్రెస్‌ గ్వార్డాడో  -   మెక్సికో    -   179 
అల్‌దెయా -    సౌదీ అరేబియా   -  178 
క్లాడియో స్వారెజ్‌-     మెక్సికో  -     177 
గియాన్లుగి బఫన్‌   -  ఇటలీ   -    176 .

చదవండి: కనీస ధర 350 కోట్లేనా!.. బీసీసీఐ ఎందుకిలా?

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)