Breaking News

విండీస్‌ బహుబలి విధ్వంసకర సెంచరీ.. 12 సిక్స్‌లతో ఊచకోత! వీడియో వైరల్‌

Published on Mon, 09/04/2023 - 11:53

కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్ ఆల్‌ రౌండర్‌, విండీస్‌ బహుబలి రఖీమ్‌ కార్న్‌వాల్ విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో భాగంగా సెయింట్ కిట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకంతో  కార్న్‌వాల్ చెలరేగాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ సాధించి ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు.

సీపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా కార్న్‌వాల్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా 48 బంతులు ఎదుర్కొన్న కార్న్‌వాల్‌ 12 సిక్స్‌లు, 4 ఫోర్లతో 102 పరుగులు చేసి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. టీ20 క్రికెట్‌లో కార్న్‌వాల్‌కు ఇదే తొలి సెంచరీ.

బార్బడోస్ రాయల్స్ ఘన విజయం..
ఇక ఈ మ్యాచ్‌లో సెయింట్ కిట్స్‌పై 8 వికెట్ల తేడాతో బార్బడోస్ రాయల్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సెయింట్ కిట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.  సెయింట్‌ కిట్స్‌ బ్యాటర్లలో ఫ్లెచర్‌(56), విల్‌ స్మిద్‌(63), రుథర్‌ఫర్డ్‌(65) పరుగులతో అదరగొట్టారు.

బార్బోడస్‌ బౌలర్లలో కార్నవాల్‌ రెండు వికెట్లు,బ్రాత్‌వైట్‌ ఒక్క వికెట్‌ పడగొట్టారు. అనంతరం 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్  కేవలం రెండు వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించింది. బార్బడోస్‌ బ్యాటర్లలో కార్న్‌వాల్‌తో పాటు కెప్టెన్‌ పావెల్‌(49) పరుగులతో అదరగొట్టాడు.
చదవండి: Asia cup 2023: నేపాల్‌తో మ్యాచ్‌కూ వర్షం గండం.. రద్దయితే టీమిండియా పరిస్థితేంటి..?

#

Tags : 1

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)