Breaking News

IPL 2025: ముంబై ఇండియన్స్‌ బౌలర్‌కు నోటీసులు ఇచ్చిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు

Published on Sun, 03/16/2025 - 21:30

ఐపీఎల్‌-2025లో భాగమైన ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ కార్బిన్‌ బాష్‌కు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు నోటీసులు ఇచ్చింది. బాష్‌.. ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ కోసం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ కాంట్రాక్ట్‌ను వదులుకున్నాడు.  సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ అయిన బాష్‌.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2025 ఎడిషన్‌ కోసం పెషావర్‌ జల్మీ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాష్‌కు అనుకోకుండా ఐపీఎల్‌ ఆఫర్‌ రావడంతో పీఎస్‌ఎల్‌ కాంట్రాక్ట్‌కు నో చెప్పాడు. 

లిజాడ్‌ విలియమ్స్‌ గాయపడటంతో ముంబై ఇండియన్స్‌ బాష్‌ను రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేసుకుంది. పీఎస్‌ఎల్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గానూ పీసీబీ బాష్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఫ్రాంచైజీ (పెషావర్‌ జల్మీ) ఏజెంట్‌ ద్వారా బాష్‌కు లీగల్‌ నోటీసులు పంపింది. 

కాంట్రాక్ట్‌ ఉల్లంఘించినందుకు గానూ వివరణ ఇవ్వాలని కోరింది. పీఎస్‌ఎల్‌ నుండి వైదొలగడం వల్ల ఎదురయ్యే పరిణామాలను వివరించింది. ఈ విషయాన్ని ఇవాళ (మార్చి 16) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. కాగా, ఐపీఎల్‌ 2025, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2025 తేదీలు క్లాష్‌ అయ్యాయి. పీఎస్‌ఎల్‌-2025 ఏప్రిల్ 11 నుండి మే 25 వరకు జరగనుండగా.. ఐపీఎల్‌ 2025 మార్చి 22 నుండి మే 25 వరకు జరుగుతుంది. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)