Breaking News

అహ్మదాబాద్‌లో 2030 కామన్వెల్త్‌ గేమ్స్‌

Published on Thu, 11/27/2025 - 08:42

గ్లాస్గో (స్కాట్లాండ్‌): ఊహించిన విధంగానే 2030 కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణ హక్కులు భారత్‌ దక్కించుకుంది. ఈ మేరకు కామన్వెల్త్‌ స్పోర్ట్‌ కార్యవర్గం బుధవారం వివరాలు వెల్లడించింది. కామన్వెల్త్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు గత నెలలోనే అహ్మదాబాద్‌ను వేదికగా ఎంపిక చేయనున్నట్లు ప్రకటించగా... ఇప్పుడు కార్యవర్గం దానికి ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషకు కామన్వెల్త్‌ స్పోర్ట్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ రుకరే ఆతిథ్య హక్కుల పత్రాలు అందజేశారు. 

దీంతో రెండు దశాబ్దాల తర్వాత భారత్‌ ఈ క్రీడలకు ఆతిథ్యమివ్వనుంది. 2010 కామన్వెల్త్‌ గేమ్స్‌ ఢిల్లీలో జరిగాయి. ‘కామన్వెల్త్‌ గేమ్స్‌ కోసం తదుపరి వేదిక ఖరారైంది. భారత్‌ ఈ క్రీడలకు కొత్త అభిరుచి, మరింత ఔచిత్యం తీసుకొస్తుందని విశి్వసిస్తున్నాం. గొప్ప సంస్కృతిని కొనసాగిస్తూ క్రీడల స్థాయిని పెంచుతుంది’ అని కామన్వెల్త్‌ స్పోర్ట్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ రుకరే అన్నారు.

కామన్వెల్త్‌ స్పోర్ట్‌ నిర్ణయాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ స్వాగతించారు. ‘ఇది గరి్వంచే క్షణం. 2047 కల్లా టాప్‌–5 క్రీడా దేశాల్లో భారత్‌ ఒకటిగా ఎదుగుతుంది’ అని మాండవీయ పేర్కొన్నారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న భారత్‌కు కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణ మంచి రిహార్సల్‌ కానుంది. 2030 కామన్వెల్త్‌ క్రీడల కోసం అహ్మదాబాద్‌తో పాటు... నైజీరియా నగరం అబుజా కూడా పోటీపడింది. అయితే 
నిర్వాహకులు మాత్రం భారత్‌నే ఎంపిక చేశారు. అబుజాను 2034 కామన్వెల్త్‌ క్రీడల కోసం పరిగణించనున్నారు. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)