హైదరాబాదీ వెటరన్‌ స్పిన్నర్‌ రీ ఎంట్రీ.. 10 ఏళ్ల తర్వాత

Published on Sat, 02/24/2024 - 02:06

అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడి దశాబ్ద కాలం గడిచిన తర్వాత ఒక ప్లేయర్‌ను క్రీడా ప్రపంచం, అభిమానులు గుర్తుంచుకోవడం దాదాపు అసాధ్యం... ఇక మహిళా క్రికెటర్లకు మన వద్ద దక్కే గుర్తింపును బట్టి చూస్తే ఇంకా కష్టం... స్వయంగా ఆ ప్లేయరే ఆటను మరచిపోయి ఇక తన పని ముగిసినట్లే భావించి అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు... కానీ 10 సంవత్సరాల విరామం తర్వాత కూడా ఒక పెద్ద టోర్నీలో మళ్లీ తెరపైకి రావచ్చని ఒక ప్లేయర్‌ నిరూపించింది.

ఆమె పేరే గౌహర్‌ సుల్తానా. హైదరాబాద్‌కు చెందిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌. 2014లో భారత్‌కు ఆఖరిసారిగా ప్రాతినిధ్యం వహించిన గౌహర్‌ ఇప్పుడు 2024 డబ్ల్యూపీఎల్‌లో మళ్లీ కనిపించబోతోంది. వేలంలో యూపీ వారియర్స్‌ జట్టు సొంతం చేసుకున్న గౌహర్‌ 36 ఏళ్ల వయసులో తనలో ఇంకా క్రికెట్‌ మిగిలి ఉందని నిరూపించేందుకు సిద్ధమైంది.   

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) తాజా సీజన్‌లో ఆడుతున్న వారిలో 2010కు ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ప్లేయర్లు ఇద్దరే ఉన్నారు. 2009లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తన తొలి మ్యాచ్‌ ఆడితే అంతకుముందు ఏడాదే 2008లో గౌహర్‌ సుల్తానా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. 2008 నుంచి 2014 మధ్యలో గౌహర్‌ భారత్‌ తరఫున 50 వన్డేలు, 37 టి20లు ఆడి మొత్తం 95 వికెట్లు పడగొట్టింది.

చక్కటి బౌలింగ్‌ ప్రదర్శనతో ఆ సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఆరేళ్ల కాలంలో వన్డేల్లో భారత బెస్ట్‌ బౌలర్‌గా (66 వికెట్లు) కొనసాగింది. రెండు వన్డే ప్రపంచకప్‌లలో ఆడింది కూడా. తన చివరి 2 వన్డేల్లో నాలుగేసి వికెట్లు చొప్పున తీసినా అనూహ్యంగా ఆమెపై సెలక్టర్లు వేటు వేశారు. అప్పుడు గౌహర్‌ వయసు 26 ఏళ్లు. కారణాలేమిటో తెలియకపోయినా మళ్లీ భార త జట్టు కోసం ఆమె పేరును పరిశీలించనేలేదు.  

సైకాలజిస్ట్‌ సహాయంతో... 
‘సాధారణంగా భారత్‌లో మహిళా ప్లేయర్లకు 26–27 ఏళ్లు వస్తే వారిని ఇక వారి వయసు అయిపోయిందని, ఆటకు పనికి రారని భావిస్తారు. ఇక 30 తర్వాత అయితే బరువు పెరుగుతుంది. ఎవరూ పట్టించుకోరు. కానీ నా ఫిట్‌నెస్‌ విషయంలో రాజీ పడరాదని భావించాను. అందుకే చాలా కష్టపడ్డాను’ అని గౌహర్‌ చెప్పింది. జాతీయ జట్టుకు దూరమైన తర్వాత ఆమె ఆగిపోలేదు. గత పదేళ్లలో దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్, పుదుచ్చేరి, బెంగాల్, రైల్వేస్‌ జట్లకు ఆడుతూ వచ్చింది.

అయితే కొత్త అమ్మాయిలతో పోలిస్తే తాను బాగా ఆడలేక వెనుకబడిపోతున్నానని భావించి తనపై తనకే అనుమానం వేసింది. ఇది మానసికంగా ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపించింది. ఇలాంటి స్థితిలో మాజీ క్రికెటర్, భారత అండర్‌–19 జట్టు కోచ్‌ నూషీన్‌ అల్‌ ఖదీర్‌ తగిన రీతిలో అండగా నిలిచింది. భారత జట్టులో గౌహర్‌తో కలిసి ఆడిన నూషీన్‌... సైకాలజిస్ట్‌ వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించడంతో పరిస్థితి మెరుగైంది.  

పట్టుదలగా నిలిచి... 
గౌహర్‌ తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన రోజులతో పోలిస్తే మహిళా క్రికెట్‌ ఎంతో మారింది. వేగంలో, వ్యూహాల్లో, ఆదరణలో అంతా మారిపోయింది. అయితే చికిత్స తర్వాత దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా బౌలింగ్‌ చేస్తుండటంతో గౌహర్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. గత రెండేళ్లలో వరుసగా వికెట్లు పడగొట్టడంలో కూడా సఫలమైంది. దాంతో 2023 డబ్ల్యూపీఎల్‌ వేలం కోసం తన పేరును నమోదు చేసుకుంది.

కానీ సహజంగానే ఈతరం అమ్మాయిల గురించి ఆలోచించే ఫ్రాంచైజీలు ఆమెను పట్టించుకోలేదు. ఈసారి కూడా సందేహంగానే అనిపించింది. కానీ ఎట్టకేలకు ఆ అవకాశం వచ్చింది. 36 ఏళ్ల వయసులో తాను పోటీ క్రికెట్‌ ఆడగలనని నమ్మకం వల్లే ఈ పునరాగమనం సాధ్యమైంది.

30 ఏళ్లు దాటిన తర్వాత ఒక సీనియర్‌ ప్లేయర్‌ ఎన్నో ప్రతికూలతలను దాటి దేశవాళీ క్రికెట్‌ను నమ్ముకొని ముందుకు సాగడం అసాధారణం. గత పదేళ్లు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు గౌహర్‌ వేసే ప్రతీ బంతిపై అందరి దృష్టీ ఉంటుంది. ఈ ఇన్నింగ్స్‌లో ఆమె అదృష్టం ఎలా ఉంటుందనేది ఆసక్తికరం.      
- సాక్షి క్రీడా విభాగం

#

Tags : 1

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)