Breaking News

సూపర్‌ క్యాచ్‌ పట్టిన బాల్‌ బాయ్‌.. హగ్‌ చేసుకున్న స్టార్‌ బ్యాటర్‌! వీడియో

Published on Tue, 03/05/2024 - 14:31

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2024లో భాగంగా సోమవారం రావల్పిండి వేదికగా పెషావర్‌ జెల్మీ, ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ జట్లు తలపడ్డాయి. ఈ హైలోల్టేజ్‌ పోరులో పెషావర్‌ను 29 పరుగుల తేడాతో ఇస్లామాబాద్‌ చిత్తు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్‌ ఆటగాడు, కివీస్‌ స్టార్‌ కోలిన్‌ మున్రో ఓ బాల్‌ బాయ్‌ను ఎత్తుకున్నాడు.

ఏం జరిగిందంటే?
పెషావర్‌ ఇన్నింగ్స్‌లో 15 ఓవర్‌లో అమీర్‌ జమాల్‌ భారీ సిక్స్‌ బాదాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్‌ అవతల ఉన్న ఓ బాల్‌ బాయ్‌ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇది గమనించిన మున్రో అతడి దగ్గరకు వెళ్లి బంతిని ఎలా పట్టుకోవాలో కొన్ని సూచనలు ఇచ్చాడు.

ఆ తర్వాత అదే ఇన్నింగ్స్‌లో 19 ఓవర్‌లో పెషావర్‌ బ్యాటర్‌ ఆరిఫ్‌ యూకుడ్‌ అదే పొజిషన్‌లో సిక్సర్‌ బాదాడు. ఈ సారి మాత్రం బాల్‌బాయ్‌ ఎటువంటి తప్పిదం చేయలేదు. అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన మున్రో వెంటనే అతడి దగ్గరకు వెళ్లి హగ్‌ చేసుకుని అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా ​మారింది.
చదవండి: IPL 2024: ధోని సంచలన నిర్ణయం.. సీఎస్‌కే కెప్టెన్‌గా రుత్‌రాజ్‌ గైక్వాడ్‌!?

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)