కోకోదే పైచేయి

Published on Mon, 10/13/2025 - 04:35

అవుహాన్‌ (చైనా): ఆద్యంతం నిలకడగా రాణించిన అమెరికా టెన్నిస్‌ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్‌ కోకో గాఫ్‌ ఈ ఏడాది తన ఖాతాలో రెండో టైటిల్‌ను జమ చేసుకుంది. ఈ సీజన్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన కోకో గాఫ్‌... ఆదివారం ముగిసిన వుహాన్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. అమెరికాకే చెందిన ప్రపంచ 6వ ర్యాంకర్‌ జెస్సికా పెగూలాతో జరిగిన తుది పోరులో కోకో గాఫ్‌ 6–4, 7–5తో గెలుపొందింది. 

1 గంట 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కోకో నాలుగు ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసింది. విజేతగా నిలిచిన కోకో గాఫ్‌కు 5,96,000 డాలర్ల (రూ. 5 కోట్ల 28 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

2 చైనా ఆతిథ్యమిస్తున్న రెండు డబ్ల్యూటీఏ– 1000 టోర్నీల్లో (బీజింగ్‌ ఓపెన్, వుహాన్‌ ఓపెన్‌) విజేతగా నిలిచిన రెండో ప్లేయర్‌ కోకో గాఫ్‌. గతంలో ఫ్రాన్స్‌ ప్లేయర్‌ కరోలినా గార్సియా (2017లో) మాత్రమే ఈ ఘనత సాధించింది.

9 హార్డ్‌ కోర్టులపై తాను ఆడిన తొమ్మిది  టోర్నీల ఫైనల్స్‌లోనూ కోకో గాఫ్‌ చాంపియన్‌ కావడం విశేషం.
 

Videos

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

హిమాలయాలు కరుగుతున్నాయ్!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Photos

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)