Breaking News

55 ఏళ్ల తర్వాత మరో టీనేజ్‌ చాంపియన్‌గా చరిత్ర.. ఆమె ఎవరంటే?

Published on Tue, 08/22/2023 - 13:05

సిన్సినాటి ఓపెన్‌ డబ్ల్యూటీఏ–1000 మహిళల టెన్నిస్‌ టోర్నీ ఫైనల్లో అమెరికా టీనేజర్, 19 ఏళ్ల కోకో గాఫ్‌ 6–3, 6–4తో కరోలినా ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలిచి తన కెరీర్‌లో తొలి మాస్టర్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

కోకో గాఫ్‌కు 4,54,500 డాలర్ల (రూ. 3 కోట్ల 77 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది ఈ గెలుపుతో 55 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో టైటిల్‌ నెగ్గిన టీనేజ్‌ ప్లేయర్‌గా కోకో గుర్తింపు పొందింది. 1968లో అమెరికాకే చెందిన 17 ఏళ్ల లిండా టుయెరో విజేతగా నిలిచింది.  

లెక్క సరిచేసిన జొకోవిచ్‌ 
ఒహాయో: సెర్బియా టెన్నిస్‌ యోధుడు జొకోవిచ్‌ తన కెరీర్‌లో 39వ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ సాధించాడు. ప్రపంచ నంబర్‌వన్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌)తో 3 గంటల 49 నిమిషాలపాటు జరిగిన సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌–1000 టోర్నీ ఫైనల్లో జొకోవిచ్‌ 5–7, 7–6 (9/7), 7–6 (7/4)తో గెలుపొందాడు.

రెండో సెట్‌ టైబ్రేక్‌లో జొకోవిచ్‌ ఒక మ్యాచ్‌ పాయింట్‌ కాపాడుకోవడం విశేషం. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 10,19,335 డాలర్ల (రూ. 8 కోట్ల 47 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ గెలుపుతో ఈ ఏడాది వింబుల్డన్‌ టోర్నీ ఫైనల్లో అల్‌కరాజ్‌ చేతిలో ఎదురైన ఓటమికి జొకోవిచ్‌ బదులు తీర్చుకున్నాడు. ఓవరాల్‌గా జొకోవిచ్‌ కెరీర్‌లో ఇది 95వ సింగిల్స్‌ టైటిల్‌కాగా, కెరీర్‌లో 1,069వ విజయం.    

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?