Breaking News

కోకో గాఫ్‌దే చైనా ఓపెన్‌

Published on Mon, 10/07/2024 - 04:13

బీజింగ్‌: అమెరికా టెన్నిస్‌ స్టార్‌ కోకో గాఫ్‌ ఈ ఏడాది రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన చైనా ఓపెన్‌ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్‌ టోర్నీలో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ కోకో గాఫ్‌ చాంపియన్‌గా అవతరించింది. ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో కోకో గాఫ్‌ 6–1, 6–3తో కరోలినా ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించింది. 76 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో కోకో ఆరు ఏస్‌లు సంధించింది. ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తన సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. 

విజేతగా నిలిచిన కోకో గాఫ్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 24 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌ ముకోవాకు 5,85,000 డాలర్ల (రూ. 4 కోట్ల 91 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  ఈ గెలుపుతో గత 14 ఏళ్లలో ఈ టోర్నీ టైటిల్‌ సాధించిన పిన్న వయసు్కరాలిగా 20 ఏళ్ల కోకో గాఫ్‌ గుర్తింపు పొందింది. 

సెరెనా విలియమ్స్‌ (2004, 2013) తర్వాత చైనా ఓపెన్‌ సాధించిన రెండో అమెరికన్‌ ప్లేయర్‌గానూ కోకో గాఫ్‌ ఘనత వహించింది. ఓవరాల్‌గా కోకో కెరీర్‌లో ఇది ఎనిమిదో సింగిల్స్‌ టైటిల్‌. తాజా టైటిల్‌తో సీజన్‌ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు అర్హత సాధించేందుకు కోకో గాఫ్‌ చేరువైంది.   

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)