Breaking News

ఫ్రెంచ్ ‘క్వీన్‌’ కోకో.. ఫైనల్లో సబలెంకా ఓటమి

Published on Sat, 06/07/2025 - 22:03

పారిస్‌: ఎర్రమట్టి కోటకు కొత్త రాణి వచ్చింది. అమెరికాకు చెందిన 21 ఏళ్ల కోకో గాఫ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ కొత్త చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్‌ కోకో గాఫ్‌ 6–7 (5/7), 6–2, 6–4తో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ అరీనా సబలెంకా (బెలారస్‌)పై విజయం సాధించింది. 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన ఈ హోరాహోరీ సమరంలో కోకో గాఫ్‌ తొలి సెట్‌ను కోల్పోయినా అధైర్యపడకుండా అసమాన పోరాటపటిమతో కోలుకుని సబలెంకాను బోల్తా కొట్టించింది.

 కోకో గాఫ్‌ కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌కాగా, తొలిసారి ఆమె ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. 2023 యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో సబలెంకాపైనే గెలిచి కోకో గాఫ్‌ తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను అందుకోవడం విశేషం. 2022 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలిసారి ఫైనల్‌ చేరిన కోకో గాఫ్‌ పోలాండ్‌ స్టార్‌ ఇగా స్వియాటెక్‌ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. 

రెండో ప్రయత్నంలో మాత్రం కోకో అత్యుత్తమ ఆటతీరుతో విన్నర్స్‌ ట్రోఫీని ముద్దాడింది. చాంపియన్‌గా నిలిచిన కోకో గాఫ్‌కు 25 లక్షల 50 వేల యూరోలు (రూ. 24 కోట్ల 91 లక్షలు), రన్నరప్‌ సబలెంకాకు 12 లక్షల 75 వేల యూరోలు (రూ. 12 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 

తడబడి తేరుకొని... 
సబలెంకాతో జరిగిన తుది పోరులో కోకో గాఫ్‌ మ్యాచ్‌ కొనసాగినకొద్దీ రాటుదేలింది. తొలి సెట్‌ ఆరంభంలో 1–4తో వెనుకబడిన కోకో నెమ్మదిగా తేరుకుంది. సబలెంకా సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసి స్కోరును 4–4తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. టైబ్రేక్‌లో సబలెంకా పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. 

రెండో సెట్‌లో కోకో అనూహ్యంగా విజృంభించగా, సబలెంకా తడబడింది. కోకో కేవలం రెండు గేమ్‌లు చేజార్చుకొని ఈ సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లో సబలెంకా సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసిన కోకో తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో స్టెఫీ గ్రాఫ్‌ (జర్మనీ) తర్వాత (1999లో మారి్టనా హింగిస్‌పై) వరల్డ్‌ నంబర్‌వన్‌తో జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో తొలి సెట్‌ కోల్పోయాక కూడా విజేతగా నిలిచిన రెండో ప్లేయర్‌గా కోకో గాఫ్‌ గుర్తింపు పొందింది.
 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)