Breaking News

ఇషా సింగ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి అభినందనలు

Published on Sun, 11/16/2025 - 09:39

తెలంగాణ షూటర్‌ ఇషా సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో ఆమె అద్భుత ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. షూటింగ్‌లో పట్టుదలతో సాధన చేస్తున్న ఇషా సింగ్‌ ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని..  భవిష్యత్తులో మరింతగా రాణించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు.

కాగా ఈజిప్టులోని కైరో వేదికగా ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో తెలంగాణ స్టార్‌ ఇషా సింగ్‌ పతకంతో మెరిసింది. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో ఈ హైదరాబాద్‌ అమ్మాయి కాంస్య పతకం సాధించింది.

ఇదిలా ఉంటే.. ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో శనివారం భారత షూటర్లు తడబడ్డారు. పురుషుల, మహిళల 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత షూటర్లలో ఒక్కరు కూడా ఫైనల్‌ చేరలేకపోయారు. పురుషుల విభాగంలో గుర్‌ప్రీత్‌ సింగ్‌ 571 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచి త్రుటిలో ఫైనల్‌ బెర్త్‌ను కోల్పోయాడు.

భారత్‌కే చెందిన ఉదయ్‌వీర్‌ సిద్ధూ 561 పాయింట్లతో 23వ స్థానంలో, రాజ్‌కన్వర్‌ సింగ్‌ సంధూ 559 పాయింట్లతో 24వ స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో పరీషా గుప్తా 556 పాయింట్లతో పదో స్థానంలో నిలువగా.. శిఖా చౌధరీ 555 పాయింట్లతో 12వ స్థానాన్ని, ఆగమ్‌ గ్రెవాల్‌ 547 పాయింట్లతో 10వ స్థానాన్ని దక్కించుకున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)