amp pages | Sakshi

సుశీల చానుకు మణిపూర్‌ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌

Published on Sun, 08/08/2021 - 10:27

టోక్యో: ఒలింపిక్స్‌ కాంస్య పోరులో భారత మహిళల హాకీ జట్టు బ్రిటన్‌ చేతిలో 4-3 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ ఆరంభం నుంచి బ్రిటన్‌కు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ చివర్లో పెనాల్టి కార్నర్‌లు సమర్పించుకొని నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే మహిళల హాకీ జట్టు ప్రదర్శనకు దేశం మొత్తం అండగా నిలబడుతోంది. పతకం సాధించికపోయినా, అద్భుతంగా ఆడారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓటమి అనంతరం తీవ్ర భావోద్వేగానికి లోనైన రాణి రాంపాల్‌ సేనను బాధపడొద్దంటూ ఓదార్చి..  దీనిని స్పూర్తిగా తీసుకొని మున్ముందు మరిన్ని పథకాలు సాధించాలని ధైర్యం చెబుతున్నారు.

అయితే భారత మహిళల హాకీ జట్టు బ్రిటన్‌తో ఓడిపోయినప్పటికీ జట్టులోని మణిపూర్‌కు చెందిన మిడ్‌ఫీల్డర్‌ సుశీల చానును ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. చానుకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు భారీ నజరానా అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ‘ నేను ఇంఫాల్‌లో అడుగుపెట్టిన వెంటనే సుశీల చానుతో మాట్లాడాను. ఈరోజు తృటిలో కాంస్యం పథకం చేజారింది. కానీ ఒలింపిక్స్‌లో మహిళల జట్టులో సుశీల ప్రదర్శనను అభినందిచాల్సిన విషయం. ఆమెకు యువజన వ్యవహారాలు, స్పోర్ట్స్ విభాగంలో ఉద్యోగంతోపాటు 25 లక్షల నగదు పురస్కారం ఇవ్వనున్నట్లు' తెలిపారు. 

మణిపూర్‌లో హాకీని మరింతగా అభివృద్ధి చేయాలని భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్ సుశీల చేసిన సూచనపై సీఎం స్పందింస్తూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో హాకీ కోసం ఆస్ట్రోటార్ఫ్ పిచ్‌లనుకూడా ఏర్పాటు చేయబోతున్నామని తెలదిపారు. కాంస్య పతకం మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు విజయం, ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించిన మహిళల జట్టు ప్రదర్శన గర్వకారణమని అని పేర్కొన్నారు. కాగా 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళ హాకీ జట్టుకు సుశీల చాను నాయకత్వం వహించారు. 

Videos

నక్కి నక్కి తిరుగుతున్న "చంద్ర" మామ

కవర్ చేద్దాం అని వీడియో చేసి దొరికిపోయిన హేమ

దేశాన్నే ఆశ్చర్యపరిచిన బాబు తెలివి తేటలు

చంద్రబాబు చెప్పకుండ పారిపోవడానికి కారణం బొత్స షాకింగ్ కామెంట్స్

KSR : సన్నబియ్యం రాజకీయం..! ఎవరి వాదన కరెక్ట్ ?

బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి

తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం

కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్

వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల

Photos

+5

KKR Vs SRH Photos: ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)

+5

Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్‌ తల్లికి అర్ష్‌దీప్‌ రిక్వెస్ట్‌ (ఫొటోలు)

+5

రజనీకాంత్‌ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. క్రికెట్‌ థీమ్‌తో.. (ఫోటోలు)

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)