LLC 2024: క్రిస్ గేల్ ఊచ‌కోత‌.. ధావ‌న్ మెరుపులు (వీడియో)

Published on Sat, 10/12/2024 - 10:09

విండీస్‌ దిగ్గ‌జం క్రిస్ గేల్‌, భార‌త‌ మాజీ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ప్ప‌ట‌కి త‌మలో ఏమాత్రం జోరుత‌గ్గ‌లేద‌ని మ‌రోసారి నిరూపించారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్‌ఎల్‌సీ)2024లో గేల్‌, ధావ‌న్ మెరుపులు మెరిపించారు.

ఈ లీగ్‌లో గుజరాత్ గ్రేట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఇద్ద‌రూ లెజెండ‌రీ క్రికెట‌ర్లు.. శుక్ర‌వారం కోనార్క్ సూర్యాస్ ఓడిశా జట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. కోనార్క్ జ‌ట్టు కెప్టెన్ టాస్ గెలిచి తొలుత గుజ‌రాత్ టీమ్‌ను బ్యాటింగ్ ఆహ్హ‌నించాడు.

గుజరాత్ గ్రేట్స్ ఓపెనర్ మోర్నీ వ్యాన్ వాయ‌క్‌(2)ను  ఆదిలోనే పేస‌ర్ విన‌య్ కుమార్ పెవిలియ‌న్‌కు పంపాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వచ్చిన గేల్..ధావ‌న్‌తో క‌లిసి ప్ర‌త్య‌ర్ది బౌలర్ల‌పై ఎదురుదాడికి దిగారు.

గేల్ 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 34 ప‌రుగులు చేయ‌గా.. ధావ‌న్ 24 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి ఔట‌య్యాడు. వీరితో ప్ర‌స‌న్న(31) ప‌రుగుల‌తో రాణించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ గ్రేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు చేసింది.

అనంతం 142 పరుగుల లక్ష్యంతో దిగిన కోనార్క్‌ కేవలం 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోనార్క్‌ బ్యాటర్లలో మునివీరా(47) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఓబ్రియన్‌(43) పరుగులతో రాణించాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)