చైనా ఓపెన్‌లో భారత షట్లర్లకు నిరాశ

Published on Thu, 09/19/2024 - 09:56

చాంగ్జౌ: చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో మాళవిక బన్సోద్‌ మినహా మిగతా భారత క్రీడాకారులంతా తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్‌లో కిరణ్‌ జార్జి... మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సామియా ఇమాద్‌ ఫారూఖి, ఆకర్షి కశ్యప్‌ తొలి రౌండ్‌ను దాటలేకపోయారు.

మహిళల డబుల్స్‌లో
ఇక మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, రుతూపర్ణ–శ్వేతాపర్ణ జోడీలు... మిక్స్‌డ్‌ డబుల్స్‌లోసిక్కి రెడ్డి–సుమీత్‌ రెడ్డి, సతీశ్‌ కుమార్‌–ఆద్యా జంటలకు నిరాశ ఎదురైంది. ప్రపంచ 40వ ర్యాంకర్‌ కిరణ్‌ జార్జి సంచలన విజయాన్ని సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ప్రపంచ 13వ ర్యాంకర్‌ కెంటా నిషిమోటో (జపాన్‌)తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్‌ జార్జి 21–4, 10–21, 21–23తో ఓడిపోయాడు.

నిర్ణాయక మూడో గేమ్‌లో కిరణ్‌ రెండు మ్యాచ్‌ పాయింట్లను వృథా చేసుకోవడం గమనార్హం. సామియా 9–21, 7–21తో క్రిస్టీ గిల్మోర్‌ (స్కాట్లాండ్‌) చేతిలో... ఆకర్షి 15–21, 19–21తో చియు పిన్‌ చెయిన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యారు.

మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ 21–16, 15–21, 17–21తో సెయి పె షాన్‌–హంగ్‌ ఎన్‌ జు (చైనీస్‌ తైపీ) చేతిలో... రుతూపర్ణ–శ్వేతాపర్ణ 11–21, 21–16, 11–21తో టెంగ్‌ చున్‌ సున్‌–యాంగ్‌ చున్‌ యున్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం చవిచూశారు. 

సిక్కి రెడ్డి–సుమీత్‌ రెడ్డికీ ఓటమే
మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత నంబర్‌వన్‌ జోడీ సిక్కి రెడ్డి–సుమీత్‌ రెడ్డి 10–21, 16–21తో టాన్‌ కియాన్‌ మెంగ్‌–లాయ్‌ పె జింగ్‌ (మలేసియా) జంట చేతిలో... సతీశ్‌–ఆద్యా ద్వయం 14–21, 11–21తో చెన్‌ టాంగ్‌ జె–తో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)