Breaking News

సెలక్టర్లకు వార్నింగ్‌.. డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగిన పుజారా

Published on Mon, 10/21/2024 - 15:50

భారత క్రికెట్ జట్టుకు దూరంగా ఉంటున్న వెటరన్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా మరోసారి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో సత్తాచాటాడు. పుజారా ప్ర‌స్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా  రాజ్‌కోట్ వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా అద్బుతమైన డ‌బుల్‌ సెంచరీతో చెలరేగాడు. 

సౌరాష్ట్ర మొద‌టి ఇన్నింగ్స్‌లో 348 బంతుల్లో త‌న డ‌బుల్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 22 ఫోర్లు ఉన్నాయి. ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో పుజారాకు ఇది 18వ డ‌బుల్ సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాకుండా పుజారా ఈ ఇన్నింగ్స్‌తో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 27,000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. 

ఈ ఘ‌నతను సాధించిన నాలుగో భార‌త క్రికెట‌ర్‌గా పూజారా నిలిచాడు. ఈ జాబితాలో పూజారా కంటే ముందు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. అదే విధంగా ఫస్ట్ క్లాస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో పూజారా నాలుగో స్ధానానికి ఎగబాకాడు. ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో డాన్ బ్రాడ్‌మన్‌(37) అగ్రస్ధానంలో ఉండగా .. తర్వాతి స్ధానాల్లో వాలీ హమం‍డ్‌(36), హెన్రడన్‌(22), పూజారా(18) కొనసాగుతున్నారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)