అర్జున్‌ సత్తాకు సవాల్‌... నేటి నుంచి చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ

Published on Wed, 08/06/2025 - 03:58

స్వదేశంలో సత్తా చాటుకునేందుకు భారత గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్‌ అర్జున్‌ ఇరిగేశి సిద్ధమయ్యాడు. చెన్నై వేదికగా నేటి నుంచి చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ జరగనుంది. 10 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరగనుంది. మాస్టర్స్‌ విభాగంలో అర్జున్‌తోపాటు భారత్‌ నుంచి విదిత్‌ గుజరాతి, కార్తికేయన్‌ మురళీ, నిహాల్‌ సరీన్, ప్రణవ్‌ వెంకటేశ్‌ బరిలో ఉన్నారు. 

ఇతర గ్రాండ్‌మాస్టర్లు అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌), విన్సెంట్‌ కీమర్‌ (జర్మనీ), అవండర్‌ లియాంగ్‌ (అమెరికా), రే రాబ్సన్‌ (అమెరికా), జోర్డాన్‌ వాన్‌ ఫారీస్ట్‌ (నెదర్లాండ్స్‌) కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కోటి రూపాయల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మొత్తం 10 మంది గ్రాండ్‌మాస్టర్లకు ప్రైజ్‌మనీ లభించనుంది. 

టాప్‌–3లో నిలిచిన వారికి వరుసగా రూ. 25 లక్షలు, 15 లక్షలు, 10 లక్షలు అందజేస్తారు. మాస్టర్స్‌ టోర్నీతోపాటు కేవలం భారత క్రీడాకారులు మాత్రమే పాల్గొనే ‘చాలెంజర్స్‌’ ఈవెంట్‌ కూడా జరగనుంది. గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి, ప్రాణేశ్, ఇనియన్, లియోన్‌ ల్యూక్‌ మెండోంకా, దీప్తాయన్‌ ఘోష్, ఆధిబన్, ఆర్యన్‌ చోప్రా, అభిమన్యు పురాణిక్, అంతర్జాతీయ మాస్టర్‌ హర్షవర్ధన్‌ పోటీపడుతున్నారు. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)