Breaking News

వికెట్‌పడ్డా.. టెస్టుల్లో ఇక ఆఖరి ఓవర్లో 6 బంతులు పడాల్సిందే!

Published on Wed, 02/04/2026 - 03:52

లండన్‌: క్రికెట్‌ నియమావళి మారింది. కొత్త మార్పులు ఈ ఏడాది నుంచే అమలవుతాయని మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) వెల్లడించింది. నియమావళిలో ఏకంగా 73 సవరణలు జరిగినప్పటికీ ప్రధానంగా టెస్టుల్లో ఇకపై ఆఖరి ఓవర్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాలన్న నిబంధన అమలుకానుంది. దశాబ్దాలుగా సంప్రదాయ ఫార్మాట్‌లో ఆ రోజు చివరి ఓవర్లో వికెట్‌ పడితే అక్కడితోనే ఆట ముగిస్తున్నారు. 

మరో బ్యాటర్‌ రావడం... మిగతా బంతులు ఆడటం జరగట్లేదు. బ్యాడ్‌లైట్‌ లాంటి ప్రతికూల వాతావరణం లేకుంటే ఇకపై బ్యాటర్‌ క్రీజులోకి రావాల్సిందే... మిగిలిన బంతులు ఆడాల్సిందేనని ఎంసీసీ సవరించిన నియమావళి చెబుతోంది. ఆఖరి ఓవర్‌ డ్రామాను అర్ధంతరంగా ముగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కొత్త మార్పులు, నియమావళిని ఈ అక్టోబర్‌ నుంచి అమలు చేయనున్నట్లు ఎంసీసీ పేర్కొంది.  

ల్యామినేటెడ్‌ బ్యాట్లకు సై 
పురుషులు ఆడే క్లబ్‌ క్రికెట్‌లో ఇకపై ల్యామినేటెడ్‌ బ్యాట్లను అనుమతిస్తారు. ల్యామినేటెడ్‌ బ్యాట్లకు దూరంగా ఉన్న ఎంసీసీ తొలిసారిగా 2017లో జూనియర్‌ క్రికెట్‌లో అనుమతించింది. ఇప్పుడు సీనియర్‌ క్రికెట్‌లో సై అంటున్నారు. బంతిని ఆడే క్రమంలో బ్యాటర్‌ తనను తాను నియంత్రించుకోకుండా వికెట్లను తగిలితే హిట్‌ వికెట్‌గా అవుట్‌ ఇస్తారు. ఇది యథాతథం. అయితే బ్యాటర్‌ ప్రమేయం లేకుండా ఫీల్డర్ల పొరపాటు వల్ల వికెట్లను తాకితే ఇకమీదట ఆ బ్యాటర్‌ను హిట్‌ వికెట్‌గా పెవిలియన్‌కు పంపించరు.  

#

Tags : 1

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)