వేదిక మార్పు మా ఆటపై ప్రభావం చూపదు: దీప్తి

Published on Thu, 08/22/2024 - 15:43

ముంబై: మహిళల టి20 ప్రపంచకప్‌ వేదిక మార్పు తమ సన్నాహాలపై ప్రభావం చూపదని భారత జట్టు ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ అభిప్రాయపడింది. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు బంగ్లాదేశ్‌ వేదికగా ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉండగా... అక్కడ రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వేదికను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కి మార్చింది.

ఈ నేపథ్యంలో దీప్తి మాట్లాడుతూ.. ‘టోర్నీ ఎక్కడ జరిగినా అత్యుత్తమ ప్రదర్శన చేయడమే మా లక్ష్యం. వేదిక మార్పు వల్ల సన్నద్ధతపై ఎలాంటి ప్రభావం పడదు. ఐసీసీ ట్రోఫీ కోసం టీమిండియా చాన్నాళ్లుగా ఎదురుచూస్తోంది. 

ఈ టోర్నీలో అటు బంతితో ఇటు బ్యాట్‌తో రాణించి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాలనుకుంటున్నా. యూఏఈలోని పిచ్‌లు ఎలా స్పందిస్తాయనే దానిపై కొంచెం అవగాహన ఉంది. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండాఆటను ఆస్వాదిస్తున్నా’ అని దీప్తి పేర్కొంది. 

ఇక ఇటీవల లండన్‌లో జరిగిన హండ్రెడ్‌ టోర్నీలో లండన్‌ స్పిరిట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దీప్తి... సీజన్‌ ఆసాంతం రాణించింది. లార్డ్స్‌ వేదికగా జరిగిన తుదిపోరులోనూ సత్తా చాటిన దీప్తి భారీ సిక్సర్‌తో లండన్‌ స్పిరిట్‌ జట్టుకు తొలి హండ్రెడ్‌ టైటిల్‌ను కట్టబెట్టింది.   

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)