Breaking News

చాంపియన్స్‌ లీగ్‌ విజేత పీఎస్‌జీ

Published on Mon, 06/02/2025 - 01:04

మ్యూనిక్‌: ప్రతిష్టాత్మక చాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌ (పీఎస్‌జీ) జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన తుది పోరులో పీఎస్‌జీ 5–0 గోల్స్‌ తేడాతో ఇంటర్‌ మిలాన్‌ జట్టుపై విజయం సాధించింది. పీఎస్‌జీ తరఫున డెసైర్‌ డౌ (20వ, 63వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో చెలరేగగా... అష్రఫ్‌ హాకిమి (12వ నిమిషంలో), ఖ్విచా క్వారట్స్‌ఖేలియా (73వ నిమిషంలో), సెన్నీ మయులు (86వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. 

మ్యాచ్‌ ఆద్యంతం పీఎస్‌జీ జట్టు ఆధిపత్యం కనబర్చగా... ఇటలీ క్లబ్‌ ఇంటర్‌ మిలాన్‌ జట్టు ఒక్క గోల్‌ కూడా సాధించలేకపోయింది. 60 శాతం బంతిని తమ ఆధినంలో పెట్టుకున్న పీఎస్‌జీ చిన్న చిన్న పాస్‌లతో ఫలితం రాబట్టింది. 70 ఏళ్ల చరిత్రగల యూరోపియన్‌ కప్‌ ఫైనల్లో ఇలా ఒక జట్టు ఏకపక్షంగా భారీ ఆధిక్యంతో విజయం సాధించడం ఇదే తొలిసారి. 

పీఎస్‌జీకి ఇదే మొదటి యూరోపియన్‌ కప్‌ టైటిల్‌ కాగా... ఏడో ఫైనల్‌ ఆడిన ఇంటర్‌ మిలాన్‌ జట్టు నాలుగోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 1956లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో రియల్‌ మాడ్రిడ్‌ జట్టు విజేతగా నిలవగా... ఇప్పుడు పీఎస్‌జీ రూపంలో 24వ విజేత అవతరించింది. మ్యూనిక్‌ వేదికగా ఇప్పటి వరకు ఐదుసార్లు ఈ టోర్నీ ఫైనల్‌ జరగగా... ఐదుసార్లూ కొత్త విజేత ఆవిర్భవించడం విశేషం.  

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు