Breaking News

చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్‌.. మిథాలీ రాజ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

Published on Mon, 07/22/2024 - 16:26

మహిళల ఆసియాకప్‌-2024లో భాగంగా మలేషియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్‌ చమరి అతపత్తు ఆజేయ సెంచరీతో చెలరేగింది. మలేషియా బౌలర్లకు అతపత్తు చుక్కలు చూపించింది. దంబుల్లా మైదానంలో ఆతపత్తు బౌండరీల వర్షం కురిపించింది. 

ఓవరాల్‌గా 69 బంతులు ఎదుర్కొన్న చమరి.. 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

లంక బ్యాటర్లలో చమరితో పాటు హర్షిత మాధవి(26), సంజీవని(31) పరుగులతో రాణించారు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఆతపత్తు పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.

ఆతపత్తు సాధించిన రికార్డులు ఇవే..
మహిళల ఆసియాకప్‌ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఆతపత్తు నిలిచింది. ఇప్పటివరకు మహిళల ఆసియాకప్‌లో ఎవరూ సెంచరీ సాధించలేకపోయారు.

అదే విధంగా మహిళల ఆసియాకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ నమోదు చేసిన ప్లేయర్‌గా కూడా ఆతపత్తు రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(97) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మిథాలీ ఆల్‌టైమ్‌ రికార్డును ఆతపత్తు బ్రేక్‌ చేసింది.

అంతర్జాతీయ టీ20ల్లో ఆతపత్తుకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ కావడం గమనార్హం.

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)