Breaking News

అప్పుడు పీయూశ్‌ చావ్లా ఆకట్టుకున్నాడు! ఈసారి టీమిండియా: గంగూలీ

Published on Sun, 07/02/2023 - 11:27

ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌-2023 ఆరంభానికి దాదాపు మూడు నెలలకు పైగానే సమయం ఉంది. భారత్‌ వేదికగా పుష్కర కాలం తర్వాత మరోసారి ఈ ఐసీసీ ఈవెంట్‌ జరుగనుండటం అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించి ఐసీసీ షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 5న ప్రపంచకప్‌ సమరానికి తెరలేవనున్నట్లు గత మంగళవారం ప్రకటించింది.

ఆతిథ్య టీమిండియా సహా పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా నేరుగా పోటీకి అర్హత సాధించాయి. మరోవైపు.. మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ క్వాలిఫయర్స్‌లోనే నిష్క్రమించగా.. శ్రీలంక, జింబాబ్వే టాప్‌-10లో అడుగుపెట్టే దిశగా ముందుకు సాగుతున్నాయి.

ఆ ముగ్గురు ఉంటారు.. అయితే
ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌ ఈవెంట్‌కు సంబంధించి జట్ల కూర్పులపై మాజీ క్రికెటర్లు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ రిస్ట్‌ స్పిన్నర్‌ను ఆడించాల్సిన ఆవశ్యకత గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘వరల్డ్‌కప్‌ కోసం ఈసారి టీమిండియా ప్రత్యేకంగా మణికట్టు స్పిన్నర్‌ను ముందుగానే సన్నద్ధం చేసుకోవాలి. నాకు తెలిసి జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌(ఫింగర్‌ స్పిన్నర్లు), అక్షర్‌ పటేల్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా అక్షర్‌.. ఎందుకంటే తను పర్ఫెక్ట్‌ ఆల్‌రౌండర్‌.

చహల్‌పై కూడా కన్నేసి ఉంచాలి
అయితే.. రవి బిష్ణోయి, కుల్దీప్‌ యాదవ్‌ వంటి రిస్ట్‌ స్పిన్నర్లపై కూడా దృష్టి సారించాలి. నిజానికి యజువేంద్ర చహల్‌ టీ20, వన్డే ఫార్మాట్లో అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. కానీ చాలా వరకు ప్రధాన టోర్నీల్లో అతడికి అవకాశం రావడం లేదు. కాబట్టి బిష్ణోయి, కుల్దీప్‌లతో పాటు చహల్‌పై కూడా ఓ కన్నేసి ఉంచాలి’’ అని గంగూలీ పేర్కొన్నాడు.

అప్పుడు పీయూశ్‌ చావ్లా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా వంటి జట్లపై రిస్ట్‌ స్పిన్నర్లు కచ్చితంగా ప్రభావం చూపగలరని అభిప్రాయపడ్డాడు. 2011 వరల్డ్‌కప్‌లో తనకున్న పరిమితిలో పీయూశ్‌ చావ్లా(మూడు మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడంటూ గుర్తు చేశాడు.

అదే విధంగా 2007లో సౌతాఫ్రికాలో ఫాస్ట్‌బౌలర్లతో పాటు మణికట్టు మాంత్రికులు కూడా రాణించారని దాదా చెప్పుకొచ్చాడు. ఈసారి ప్రపంచకప్‌ భారత్‌లో జరుగుతుంది కాబట్టి రిస్ట్‌ స్పిన్నర్లకు మరింత అనుకూలంగా ఉంటుందని గంగూలీ పేర్కొన్నాడు.

చదవండి: WC 2023: ఇప్పుడే అంతా అయిపోలేదు.. వెస్టిండీస్‌ అద్భుతాలు చేయగలదు!

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి