Breaking News

Wimbledon 2024: ‘కింగ్‌’ అల్‌కరాజ్‌

Published on Mon, 07/15/2024 - 03:10

లండన్‌: పురుషుల టెన్నిస్‌లో కార్లోస్‌ అల్‌కరాజ్‌ శకం మొదలైంది! 21 ఏళ్ల ఈ స్పెయిన్‌ స్టార్‌ వరుసగా రెండో ఏడాది వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్‌ అల్‌కరాజ్‌ 2 గంటల 27 నిమిషాల్లో 6–2, 6–2, 7–6 (7/4)తో రెండో సీడ్‌ , 24 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ విజేత జొకోవిచ్‌ (సెర్బియా)పై గెలిచాడు. 

విజేత అల్‌కరాజ్‌కు 27 లక్షల పౌండ్ల (రూ. 29 కోట్ల 23 లక్షలు) ప్రైజ్‌మనీ... రన్నరప్‌ జొకోవిచ్‌కు 14 లక్షల పౌండ్ల (రూ. 15 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీ లభించాయి. అల్‌కరాజ్‌ కెరీర్‌లో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌. అతను 2022లో యూఎస్‌ ఓపెన్, 2023లో వింబుల్డన్, 2024లో ఫ్రెంచ్, వింబుల్డన్‌ టోర్నీలను సాధించాడు.  
 
బ్రేక్‌ పాయింట్‌తో మొదలు... 
గత ఏడాది ఐదు సెట్‌ల పోరులో జొకోవిచ్‌ను ఓడించిన అల్‌కరాజ్‌ ఈసారి తొలి పాయింట్‌ నుంచే ఆధిపత్యం కనబరిచాడు. తొలి సెట్‌లో 14 నిమిషాలపాటు జరిగిన తొలి గేమ్‌లోనే జొకోవిచ్‌ సర్వీస్‌ను అల్‌కరాజ్‌ బ్రేక్‌ చేశాడు. ఆ తర్వాత ఐదో గేమ్‌లో జొకోవిచ్‌ సర్వీస్‌ను రెండోసారి బ్రేక్‌ చేసిన అల్‌కరాజ్‌ అదే జోరులో 41 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. 

రెండో సెట్‌లో తొలి గేమ్‌లో, ఏడో గేమ్‌లో జొకోవిచ్‌ సర్వీస్‌లను బ్రేక్‌ చేసిన అల్‌కరాజ్‌ 34 నిమిషాల్లో  సెట్‌ నెగ్గాడు. మూడో సెట్‌లోని తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన అల్‌కరాజ్‌ పదో గేమ్‌లోని తన సర్వీస్‌లో 40–0తో మూడు మ్యాచ్‌ పాయింట్లను సాధించాడు. 

అయితే ఈ మూడు మ్యాచ్‌ పాయింట్లను జొకోవిచ్‌ కాపాడుకొని గట్టెక్కాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. టైబ్రేక్‌లో అల్‌కరాజ్‌ పైచేయి సాధించి జొకోవిచ్‌ ఆట కట్టించాడు.  

6 ఓపెన్‌ శకంలో ఒకే ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌ టోర్నీ టైటిల్స్‌ సాధించిన ఆరో ప్లేయర్‌ అల్‌కరాజ్‌. గతంలో రాడ్‌ లేవర్‌ (ఆ్రస్టేలియా; 1969లో), జాన్‌ బోర్గ్‌ (స్వీడన్‌; 1978, 1979, 1980లలో), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌; 2008, 2010లలో), ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌; 2009లో), జొకోవిచ్‌ (సెర్బియా; 2021లో) ఈ ఘనత సాధించారు.  

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)