Breaking News

హారికకు మూడో స్థానం

Published on Sat, 06/21/2025 - 08:10

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): కెయిన్స్‌ కప్‌ అంతర్జాతీయ మహిళల చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్, హైదరాబాద్‌ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక మూడో స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టార్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి వరుసగా మూడో ఓటమి చవిచూసి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. అలీనా కషిన్‌స్కాయ (పోలాండ్‌)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్‌ గేమ్‌ను హారిక 38 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించి 5 పాయింట్లతో మూడో స్థానాన్ని ఖరారు చేసుకుంది. గత ఏడాది కూడా మూడో స్థానంలో నిలిచిన హారిక ఈ ఏడాది టోర్నీలో కేవలం కోనేరు హంపి చేతిలో ఓడిపోయి... మిగతా ఎనిమిది గేముల్లో రెండింటిలో గెలిచి, ఆరింటిని ‘డ్రా’ చేసుకుంది. 

ఆరో రౌండ్‌ తర్వాత అగ్రస్థానంలో నిలిచిన హంపి వరుసగా మూడు గేముల్లో ఓడిపోయి 4.5 పాయింట్లతో ఐదో స్థానాన్ని పొందింది. ఏడో రౌండ్‌లో కరిసా యిప్‌ (అమెరికా) చేతిలో, ఎనిమిదో రౌండ్‌లో నినో బత్సియా‹Ùవిలి (జార్జియా) చేతిలో ఓడిన హంపి 46 ఎత్తుల్లో మరియా ముజీచుక్‌ (ఉక్రెయిన్‌) చేతిలో పరాజయం పాలైంది. హంపితోపాటు నానా జాగ్‌నిద్జె (జార్జియా), బీబీసారా అసబయేవా (కజకిస్తాన్‌), అలీషా 4.5 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచారు. 

మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... నానా జాగ్‌నిద్జె నాలుగో స్థానంలో, హంపి ఐదో స్థానంలో, బీబీసారా ఆరో స్థానంలో, అలీషా ఏడో స్థానంలో నిలిచారు. పది మంది మేటి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్‌లపాటు ఈ టోర్నీని నిర్వహించగా... 6 పాయింట్లతో కరిసా యిప్‌ (అమెరికా) చాంపియన్‌గా అవతరించింది. 5.5 పాయింట్లతో అలైస్‌ లీ (అమెరికా) రన్నరప్‌గా నిలిచింది. విజేత కరిసా యిప్‌నకు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షల 96 వేలు), రన్నరప్‌ అలైస్‌ లీకి 50 వేల డాలర్లు (రూ. 43 లక్షల 30 వేలు), మూడో స్థానంలో నిలిచిన హారికకు 40 వేల డాలర్లు (రూ. 34 లక్షల 64 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.    

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)