Breaking News

Candidates Chess 2024: విదిత్‌ గుజరాతీ విజయం

Published on Tue, 04/16/2024 - 06:13

టొరంటోలో జరుగుతున్న ప్రతిష్టాత్మక క్యాండిడెట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు విదిత్‌ గుజరాతీ మరో కీలక విజయాన్ని నమోదు చేశాడు. 9వ రౌండ్‌లో హికారు నకమురా (అమెరికా)ను విదిత్‌ ఓడించాడు. ఈ గెలుపుతో ఓవరాల్‌గా 4.5 పాయింట్లతో విదిత్‌...నకమురా, కరువానాలతో కలిసి నాలుగో స్థానంలో నిలిచారు. మరో వైపు ఇద్దరు భారత ఆటగాళ్లు
డి.గుకేశ్, ఆర్‌. ప్రజ్ఞానంద మధ్య జరిగిన గేమ్‌ ‘డ్రా’గా ముగిసింది.

తాజా ఫలితం తర్వాత గుకేశ్, నెపొమినియాచి 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 4 పాయింట్లతో ప్రజ్ఞానంద తర్వాతి స్థానంలో ఉన్నాడు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి  9వ రౌండ్‌ గేమ్‌ ‘డ్రా’ అయింది. హోరాహోరీ పోరు తర్వాత హంపి, రష్యాకు చెందిన కటెరినా లాగ్నో తమ గేమ్‌ను సమంగా ముగించారు. హంపికి మధ్యలో విజయావకాశాలు వచి్చనా కటెరినా తెలివిగా ఆడి తప్పించుకోలిగింది. అయితే మరో భారత ప్లేయర్‌ ఆర్‌.వైశాలి...చైనాకు చెందిన జోంగి తన్‌ చేతిలో ఓటమిపాలైంది. ప్రస్తుతం హంపి 4 పాయింట్లతో ముజిచుక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి ఐదో స్థానంలో కొనసాగుతోంది.   

Videos

ఆదాయం అంతా ఉద్యోగులకు జీతాలకే సరిపోతుందని ఎలా మాట్లాడుతారు?

ఎన్టీఆర్ కి బాబు వెన్నుపోటు పొడిచి 31ఏళ్లు అయింది

దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి

ఇరుముడి OTTలోకి ఎప్పుడు.?

లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

బొల్లారంలో టెన్షన్.. 4 ఏకే-47లు.. 1120 బుల్లెట్లు మిస్సింగ్

Kapra Lake: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై వివాదం..

తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం

చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక

మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా

Photos

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)