Breaking News

ఐదు రోజుల్లో మూడు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన కెనడా స్విమ్మర్‌

Published on Fri, 06/13/2025 - 11:58

విక్టోరియా: కెనడా స్టార్‌ స్విమ్మర్‌ సమ్మర్‌ మెకింటోష్‌ మరో ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే కెనడా జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్‌ ట్రయల్స్‌లో 18 ఏళ్ల మెకింటోష్‌ ఐదు రోజుల వ్యవధిలో మూడో ప్రపంచ రికార్డు తిరగరాసింది. బుధవారం జరిగిన 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ రేసులో 4 నిమిషాల 23.65 సెకన్లలో లక్ష్యాన్ని చేరి తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును (4 నిమిషాల 24.38 సెకన్లు) తిరగరాసింది.

గత ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణ పతకాలు సాధించిన మెకింటోష్‌... వచ్చే నెలలో సింగపూర్‌ వేదికగా జరగనున్న ప్రపంచ అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటికే మెకింటోష్‌ 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ, 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగాలలో రెండు ప్రపంచ రికార్డులు సృష్టించింది. ‘పోటీకి ముందే ఏదో ప్రత్యేకంగా చేస్తానని అనుకున్నా. నా కెరీర్‌లో ఇది అత్యుత్తమ టోర్నీ. ప్రపంచ రికార్డులు నమోదయ్యేవి బద్దలవడానికే. కొలనుకు వీడ్కోలు చెప్పేంతవరకు వాటిపై నా పేరే ఉండే విధంగా చూసుకుంటా’ అని మెకింటోష్‌ పేర్కొంది.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)